kumaram bheem asifabad- అంబేద్కర్ ఆశయాల సాధనే ధ్యేయం
ABN, Publish Date - Jul 11 , 2025 | 10:24 PM
అంబేద్కర్ ఆశయాల సాధన కోసం వర్షవాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ పరందాములు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న వర్షవాస్ కార్యక్రమాల తీరుపై పరిశీలనకు వచ్చిన సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి మాట్లాడారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 11(ఆంధ్రజ్యోతి): అంబేద్కర్ ఆశయాల సాధన కోసం వర్షవాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ పరందాములు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న వర్షవాస్ కార్యక్రమాల తీరుపై పరిశీలనకు వచ్చిన సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి మాట్లాడారు. మూడనమ్మకాలను విశ్వసించకుండా అంబేద్కర్, బుద్ధుడు చూపిన సన్మార్గంలో నవడానికి ప్రజలను సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే జిల్లాలో పర్యటన నిర్వహిస్తున్నామన్నారు. బుద్ధుడితో నా ప్రయాణం అనే తెలుగు సాంస్కృతిక నాటకాన్ని ప్రజలు తప్పకుండా చూడాలని కోరారు. అనంతరం జిల్లా కేంద్రంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సూర్యప్రకాష్, బాలాజీ, సునీల్, అశోక్, తుకారాం, తిరుపతి, శ్యాంరావు, జయంత్‌కుమార్, సంతోష్, లక్ష్మణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బుద్ధుడి బోధనలు ఆచరించాలి
వాంకిడి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బుద్ధుడి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ పరందాములు అన్నారు. మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధవిహార్‌లో బుద్ధ అండ్ ధమ్మ గ్రంథ పఠన కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి హైదరాబాద్ వారిచే నిర్వహించిన బుద్ధుడితో నా ప్రయాణం నాటిక ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి వీక్షించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ పరందాములు మాట్లాడుతూ బుద్ధుడి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఈ సందర్భంగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులను ఆయన అభినందించారు.
Updated Date - Jul 11 , 2025 | 10:24 PM