ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం...

ABN, Publish Date - May 04 , 2025 | 11:30 PM

మంచిర్యాల నియోజ కవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివా రం రూ. 31.8 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధే ప నులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

రాజీవ్‌నగర్‌లో బీటీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌

-మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

-రూ. 31.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మంచిర్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియోజ కవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివా రం రూ. 31.8 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధే ప నులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీ నివాస గార్డెన్‌ వరకు హైదరాబాద్‌- చాందా రహదారిపై రూ. 16.6 కోట్లతో వరుసల బీటీ రోడ్డు నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. అలాగే మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలోని గాంధీనగర్‌ నుంచి రాజీవ్‌నగర్‌ వరకు టీయూఎఫ్‌ఐడసీ ని ధులు రూ. 3.58 కోట్లతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు ను ప్రారంభించారు. తొమ్మిదవ వార్డులోని రంగంపేటలో రూ. 1.57 కోట్లతో సీసీ డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, 17వ వార్డు బృందావన కాలనీలో రూ. 65 లక్షలతో డ్రైన్‌లు, రోడ్ల నిర్మాణం, 4వ వార్డు రాజరాజేశ్వర కాలనీలో రూ. 2.91 కోట్లతో డ్రైన్‌లు, రోడ్లు, 3 వార్డు సూర్యనగర్‌లో రూ. 2.70 కోట్లతో, హమాలివాడ హనుమాన్‌ ఆలయం నుం చి తిలక్‌నగర్‌ వరకు ఇరువైపులా రూ. 2 కోట్లతో, 1వ వార్డు రాజీవ్‌నగర్‌లో రూ. 3.37 కోట్లతో, దొరగారిపల్లిలో రూ. 2 కో ట్లతో డ్రైన్లు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గాన్ని రాష్ట్రం లోనే మొదటి స్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రహదారుల నిర్మాణం ద్వారా మంచి ర్యాల నగరంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య ఉండదని తెలి పారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చే సేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పట్టణాన్ని అన్ని హంగులతో ఆధునీకరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమా లలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శివాజీ, రోడ్లు భవనా లశాఖ ఈఈ భవర్‌సింగ్‌, పలువురు కాంగ్రెస్‌ తాజామాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:30 PM