సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:40 AM
దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన చేపట్టిన సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌లో కార్మికవర్గం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ప్రజా సంఘాల పిలుపు
నల్లగొండరూరల్, జూలై 2(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన చేపట్టిన సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌లో కార్మికవర్గం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. దొడ్డి కొమరయ్య భవనలో బుధవారం నిర్వహించిన ప్రజాసంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన నిర్వహించే సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందని ఆరోపించారు. ప్రజలు, రైతాంగం, కార్మికులు సుదీర్ఘ పోరాటాల ద్వారా ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌ల పేరుతో కార్మికవర్గ హక్కులను రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు లేకుండా, కార్మిక సంఘాల రిజిస్ట్రేషనను కఠినతరం చేసి, కార్మికులను సంఘాల నుంచి దూరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అంతేకాక పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని కోరారు. కార్మిక సంఘాల నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులను దేశాన్ని అప్పగించాలన్న కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగానే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. కార్మికవర్గానికి శ్రమకు తగిన ఫలితం దక్కనీయకుండా కనీస వేతనాలు అందించకుండా, ఎలాం టి సామాజిక భద్రత పథకాలు అమలు చేయకుండా చూస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, శ్రీశైలం, గంజి మురళీధర్, అవిశెట్టి శంకరయ్య, ఎండీ సలీం, సత్తయ్య, శ్రీనివాస్, పరశురాములు, మ హేష్, వరలక్ష్మి, కొండ అనురాధ, వెంకన్న, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 12:40 AM