సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ABN, Publish Date - May 14 , 2025 | 11:16 PM
సార్వత్రిక సమ్మెలో భా గంగా ఈ నెల 20న జరగను న్న గ్రామీణ బందును జయప్ర దం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీని వాసులు అన్నారు.
కోడేరు, మే 14 (ఆంధ్రజ్యో తి) : సార్వత్రిక సమ్మెలో భా గంగా ఈ నెల 20న జరగను న్న గ్రామీణ బందును జయప్ర దం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీని వాసులు అన్నారు. మండల కేం ద్రంలోని సీపీఎం కార్యాలయం లో సీఐటీయూ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించి కార్మికులకు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును కూ డా హరించిందన్నారు. ప్రస్తుతం 300 మంది కార్మికులు ఉంటేనే సంఘం ఏర్పాటు చేసుకో వాలని కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాల ను అవలంభిస్తుం దన్నారు. ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పి.రవి, కాకం వెంకటయ్య, సాయిబాబా పాల్గొన్నారు.
ఫ నాగర్‌కర్నూల్ టౌన్ : కార్మికుల సమస్య లపై ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయం ఆవరణంలో పారిశు ధ్య కార్మికులతో దేశ వ్యాప్త సమ్మె పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్ కా ర్మికులు కురుమయ్య, పరశురాములు, వెంకట య్య, బాలస్వామి, వెంకటేష్, రమేష్, లక్ష్మీ, కృష్ణమ్మ, భారతి, కృష్ణవేణి పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 11:16 PM