ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:23 PM
ప్ర భుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉంద ని, ప్రైవేట్ పాఠశాలలు వద్దని మండల విద్యా శాఖ అధికారి సత్యనారాయణశెట్టి అన్నారు.
- ఎంఈవో సత్యనారాయణశెట్టి
తిమ్మాజిపేట, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : ప్ర భుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉంద ని, ప్రైవేట్ పాఠశాలలు వద్దని మండల విద్యా శాఖ అధికారి సత్యనారాయణశెట్టి అన్నారు. మండల కేంద్రంలోని బోయగిరిలో ఆదివారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యా యులతో కలిసి పాల్గొన్న ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులచే విద్యాబోధన ఉంటుందని, విశాలమైన తరగతి గదులు ఉంటాయని, ఆడుకోవడానికి మైదానాలు, తెలుగు, ఆంగ్లంలోనూ విద్యాబోధన ఉంటుందన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామన్నారు. ఉపా ధ్యాయులు అత్తర్ అలీ, జైపాల్‌రెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు.
ఫ బిజినేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణా తులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందుతుందని ప్రధానోపాధ్యాయు డు హనుమంత్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. మండలంలోని నంది వడ్డెమాన్, సల్కర్‌పేట గ్రామాల్లో ఆదివారం బడిబాట కా ర్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించడం ద్వారా కలి గే లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఉపాఽ ద్యాయులు చంద్రమోహన్‌రెడ్డి, వెంకటస్వామి, కృష్ణకుమార్, హుస్సేన్, రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
ఫ ఉప్పునుంతల : రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలను భలోపేతం చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని, విద్యార్థులకు సాంకేతిక వి ద్యును అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నా మనితాడూర్ ప్రాథమికోన్నతపాఠశాల హెచ్‌ఎం జక్క రామస్వామి అన్నారు. బడిబాటలో భా గంగా గ్రామంలో ఇంటింట ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల, శ్రీను వాసులు, వసంతకుమార్, గోపి, లక్ష్మీనారాయ ణ, కమల, పద్మ, గ్రామస్థులు చంద్రయ్య, కృష్ణ య్య, తిరుపతయ్య, అశోక్‌గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శివ, తిరుపతయ్య పాల్గొన్నారు.
ఫ అమ్రాబాద్ : మండలంలోని వివిధ గ్రా మాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని కాలనీలలో సీపీఎస్ ప్రధానోపా ధ్యా యులు ఇమ్మడి విజయమోహన్ ఆధ్వర్యంలో ఉ పాధ్యాయులు ఇంటింటి ప్రచారంలో పాల్గొ న్నా రు. అమ్రాబాద్‌లో ఇప్పటి వరకు 25 మంది వి ద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో వారు ఒప్పుకున్నారని హెచ్‌ఎం విజయ మోహన్ తెలి పారు. పాఠశాల ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:23 PM