దుమ్ము లేస్తోంది
ABN, Publish Date - May 17 , 2025 | 11:51 PM
నల్లగొండ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా బస్టాండ్ నుంచి గొల్లగూడెంవరకు చేపట్టిన రోడ్డు విస్తరణ ప నులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
దుమ్ము లేస్తోంది
నత్తనడకన రోడ్డు నిర్మాణపు పనులు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, ప్రజలు
త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్
నల్లగొండటౌన, మే 17 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా బస్టాండ్ నుంచి గొల్లగూడెంవరకు చేపట్టిన రోడ్డు విస్తరణ ప నులు నత్తనడకన కొనసాగుతున్నాయి. నెలలు గడిస్తున్నా కేవలం కిలో మీటర్ మేర పనులు పూర్తిచేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప నులు మందకొడి సాగుతుండటంతో ప్రజలు దు మ్ములో ఉండాల్సి వస్తుంది.రోడ్డుపై వాహనాలు తిరి గే సమయంలో ఎదురుగా ఉన్న చిన్న చిన్న వాహనాలు దుమ్ముకు కనిపించడం లేదు. దుమ్ము లేవకుండా నీటిని చల్లాల్సి ఉన్నా నామమాత్రంగా నీరు చల్లుతుండటంతో స్ధానికులు ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యం వందలాది వాహనాల రాకపోకలు
బస్టాండ్ నుంచి గొల్లగూడ మార్గంలో నిత్యం వం దలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా బస్టాండ్, రైల్వేస్టేషన, అవుట్‌డోర్ స్టేడి యం, కలెక్టరేట్‌లకు వెళ్లాలంటే ఇదే రోడ్డు మార్గం గుండా పయనించాల్సి ఉంది. అయితే మూడు నెల ల క్రితం ప్రారంభించిన ఈ రోడ్డు పనులు నత్తనడక న సాగుతుండటంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడంలేదు. రోడ్డు కంకర, డస్ట్ వేసి వదిలివేయడంతో ఆ మార్గం గుండా వెళ్లేవారికి నరకం కనబడుతుంది. ముఖ్యంగా బస్టాండ్, గవర్నమెంట్ ఆస్పత్రి ఏరియాల్లో రోడ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు వెంట ఉండటం దుమ్ము ధూళి అంతా తినుబండారాలపై పడుతుండటంతో వ్యాపారులు వ్యాపారం కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకరతేలిన రోడ్డుపై ప్రయాణించాలంటే నే భయమేస్తుందని వాహనదారులు వాపోతున్నా రు. వెంటనే రోడ్డును పూర్తి చేసి ప్రజల కష్టాలను తీర్చాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నత్తనడకన విస్తరణ పనులు
గత ప్రభుత్వ హయాంలో మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్‌టవర్, బస్టాండ్, గొల్లగూడ, పెద్దబండ మీదుగా కలెక్టరేట్ వరకు రోడ్డు విస్తరణ పనలు చేపట్టారు. అయితే అప్పట్లో మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్‌టవర్ మీదుగా బస్టాండ్ వరకు గొల్లగూడ నుంచి పెద్దబండ మీదుగా కలెక్టరేట్ వరకు రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి సుందరీకరణ లో భాగంగా సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే బస్టాండ్ నుంచి గొల్లగూడ వర కు వేయాల్సిన రోడ్డు పనులు వివిధ కారణాలతో అప్పట్లో నిలిచిపోయాయి. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఆ రోడ్డు పనులు కొంతకాలం పెండింగ్‌లో పడ్డాయి. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొతకాలం వరకు రోడ్డు పనలు చేపట్టలేదు. ఇటీవలే మూడు నెలల క్రితం నిలిచిపోయిన కిలోమీటర్ మేర పనులను ప్రారంభించా రు. అయినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలే దు. కేవలం కంకర, డస్ట్ వేసి వదిలివేశారు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా రోడ్డు పనులు వెంటనే పూర్తి చేసి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కళ్లు పాడవుతున్నాయి
ఈ మార్గం నుంచి నిత్యం ద్విచక్ర వాహనంపై వెళ్తుంటాను. రోడ్డు పనులు పూర్తి కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోడ్డుపై ఉన్న దుమ్మంతా కళ్లలో పడుతుంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీనికి తోడు దుమ్ము కళ్లలో పడటం కారణంగా కళ్లు కూడా పాడవుతున్నాయి. పనులు పూర్తయ్యే వరకు ఈ రోడ్డుపై ప్రయాణం నరకంగా ఉండేలా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తి చేయించాలి.
- పగిళ్ల శంకర్, గొల్లగూడ, నల్లగొండ
Updated Date - May 17 , 2025 | 11:51 PM