ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేత్రపర్వంగా రాములోరి పట్టాభిషేకం

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:18 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రాములోరి పట్టాభిషేకం సోమవారం వైభవంగా నిర్వహించారు.

హారతి సమర్పిస్తున్న అర్చకుడు

యాదగిరిగుట్ట, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రాములోరి పట్టాభిషేకం సోమవారం వైభవంగా నిర్వహించారు. నిత్యా రాధనల అనంతరం తిరువీధిసేవ చేపట్టి మూలమంత్ర జపాలు, దశశాంతి, పంచ సూక్త పారాయణాలతో అభిషేకాలు, ఆధ్యాత్మ రామాయణ పారాయణం అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. పట్టాభిషేకం మహోత్సవ విశిష్టతను ఆలయ సిద్ధాంతి గౌరిభట్ల సత్యనారాయణశర్మ, ప్రధాన పూజారి నరసింహమూర్తి భక్తులకు వివరించారు. అర్చకుల వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య అభిషేక మండపంలోని సువర్ణ కలశాలలో నింపి స్వర్ణ సింహాసనంపై అధిష్ఠింపజేసి పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలోని యాగశాలలో సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ జరిపారు. వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, ఈవో ఏపూరి భాస్కర్‌రావు, ఉప కార్యనిర్వాహణ అధికారి దోర్భల భాస్కరశర్మ, ఏఈ వోలు ప్రతాప నవీన్‌కుమార్‌శర్మ, గజ్వేల్లి రమేష్‌బాబు, రఘు, పర్యవేక్షకులు నాగుల మహేష్‌, రామరావునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

శివకేశవులకు విశేష పూజలు

శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామిఅమ్మవారికి శ్రీ వైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానాల యంలో సుప్రభాత సేవతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు మూల మూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి విశ్వక్సేనుడికి తొలి పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణో త్సవం నిర్వహించారు. శివాలయంలోని ముఖమండపంలో స్ఫటికమూర్తులను అర్చ కులు వేదమంత్ర పఠనాలు, మంగళ వాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషే కించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖ జానాకు రూ.19,44,856ల ఆదాయం సమకూ రినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆ లయంలో భక్తవత్సలుడి కల్యాణోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వయం భువునికి పంచామృతాలతో పంచసూక్త విధానంగా అభిషేకాలు చేపట్టారు. ఉదయం యాగశాలలో సుదర్శన నారసింహ హోమాలు జరిగాయి. ఉత్సవ మూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:18 AM