ఆయకట్టు చివరకు నీరందించాలి
ABN, Publish Date - Mar 19 , 2025 | 12:33 AM
ఏఎమ్మార్పీ చివరి ఆయకట్టు వరకు నిరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్ సూచించారు.
గుర్రంపోడు, మార్చి18 (ఆంధ్రజ్యోతి): ఏఎమ్మార్పీ చివరి ఆయకట్టు వరకు నిరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్ సూచించారు. మండల పరిధిలోని డీ-25 కాల్వను మంగళవారం పరిశీలించారు. ఆయకట్టు చివరి మారేపల్లి ప్రాం తానికి నీరు చేరేలా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. 18 కిలోమీటర్ల పొడవునా గల డీ-25 కాల్వలో చివరి ఆయకట్టుకు నిరందించేందుకు కాల్వ ప్రారంభం నుంచి రైతులు అనఽ దికారికంగా ఏర్పాటు చేసుకున్న గండ్లు, పైపులన్నింటినీ తొలగించాలని ఆదేశించారు. అడ్డుపడితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గుర్రంపోడు డివిజన్ ఈఈ నెహ్రూనాయక్, డీఈ పరమేష్, సురే్‌షకుమార్, ఏఈ శ్రీనివాసరావు, చంద్రప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.
మిర్యాలగూడ: అదనపు ఓట్ల తొలగింపునకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ అన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. ఫాం-6, 7, 8లలో తలెత్తిన సమస్యల పరిష్కారంతో పాటు డుప్లికేట్ ఓట్లను తొలగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ హరిబాబు, కమిషనర్ యూసుఫ్ పాల్గొన్నారు.
నీటిని అడ్డుకోవద్దు
హాలియా: డీ-25 కాల్వ పైభాగంలో సాగు చేస్తున్న రైతులు దిగువకు రాకుండా నీటిని అడ్డుకోవడం సరికాదని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్‌నారాయణ అన్నారు. అనుముల మండలంలోని మారేపల్లి రైతులతో కలిసి డీ-25 కాల్వను మంగళవారం పరిశీలించారు. కాల్వలో ప్రవహిస్తున్న నీటిని ఎవరికి వారు అడ్డుకొని మళ్లిస్తే చివరి రైతులకు ఇబ్బంది అవుతుందన్నారు. ఇరిగేషన్ అధికారులు కాల్వను పర్యవేక్షించాలని సూచించారు. నిబంధనల ప్రకారం తూముకు సరిపడా నీరు వస్తుందన్నారు. ఆయన వెంట ఈఈ నెహ్రూ, డీఈ పరమేష్, తహసీల్దార్ రఘు, ఎంపీడీవో సుజాత, ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి, ఏవో సరిత పాల్గొన్నారు.
Updated Date - Mar 19 , 2025 | 12:33 AM