ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదివాసీ గిరిజనులను చైతన్యపర్చడమే ధ్యేయం

ABN, Publish Date - May 08 , 2025 | 11:24 PM

ఆదివాసీ గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్యపర్చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ట్రైకార్‌ రాష్ట్ర చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్య నాయక్‌ అన్నారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్య నాయక్‌

ట్రైకార్‌ రాష్ట్ర చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్య నాయక్‌

జన్నారం, మే 8 (ఆంధ్రజ్యోతి) : ఆదివాసీ గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్యపర్చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ట్రైకార్‌ రాష్ట్ర చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్య నాయక్‌ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ముగ్గురు చొప్పున గిరిజన ఆదివాసీల కాంగ్రెస్‌ ప్రతినిధుల శిక్షణ కా ర్యక్రమం ఈ నెల 11,12,13 తేదీల్లో మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో నిర్వహించనుండగా జీసీసీ చైర్మన్‌ కోట్నాక తిరుపతి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జీ సుగుణతో కలిసి గురు వారం ఏర్పాట్లను పరిశీలించారు. బెల్లయ్య నాయక్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతుల కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు రాష్ట్ర ప్రముఖ నేతలు హాజరవుతారన్నారు. దేవంలో గిరి జన ఆదివాసీల అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఆదివాసీ, గిరి జనులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన ఆదివాసీల కోసం అనేక చట్టాలను చేసిందన్నారు. జల్‌ జంగల్‌, జమీన్‌ నినాదానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంద న్నారు. ఈ నినాదంతో రాహుల్‌గాంధీ పాదయాత్ర కూడా చేపట్టారన్నారు. ఈ కార్యక్ర మంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గం లక్ష్మీనారాయణ, పొనకల్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ అల్లం రవి, కాంగ్రెస్‌ నాయకులు ముజాఫర్‌, మోహ న్‌రెడ్డి, ఇసాక్‌, రమేష్‌రావు, ఇందయ్య, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:24 PM