ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Census: వాడిగా.. వేడిగా..!

ABN, Publish Date - Feb 04 , 2025 | 03:52 AM

సమగ్ర కుల గణన సర్వే నివేదికను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం దీనిపై చర్చను చేపట్టనుంది. అలాగే, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపైనా చర్చించనుంది.

  • కుల గణన సర్వే నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ

  • ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై కూడా

  • అస్త్ర శస్త్రాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు

  • రోజంతా కసరత్తు చేసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కుల గణన సర్వే నివేదికను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం దీనిపై చర్చను చేపట్టనుంది. అలాగే, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపైనా చర్చించనుంది. ఇందుకు శాసనసభ, మండలి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే, కుల గణన సర్వే నివేదికపై ప్రతిపక్షం, వివిధ సంఘాల నుంచి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.


కుల గణన సర్వే నివేదికతోపాటు బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ అంశాలు ఒకేసారి శాసనసభలో చర్చకు వస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఈ చర్చకు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు చెబుతున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని సబ్‌ కమిటీకి ప్రణాళిక శాఖ సమర్పించిన కులగణన సర్వే నివేదికను క్యాబినెట్‌ ఆమోదించనుంది. అలాగే, వర్గీకరణపై షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదిక, బీసీ కోటాపై బూసాని వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలోని కమిషన్‌ ఇవ్వనున్న నివేదికనూ క్యాబినెట్‌ చర్చించి ఆమోదించనుంది.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 03:52 AM