ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజీవ్‌ యువ వికాసానికి తాత్కాలిక బ్రేక్‌

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:36 PM

నిరుద్యోగ యువ తకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆర్థి కంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి నె లాఖరు వరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిం చింది.

జిల్లాలో 12,131 యూనిట్లకు గాను 52,839 మంది దరఖాస్తు

లబ్ధిదారుల ఎంపికలో మరింత జాప్యం

కాసిపేట, జూన్‌16 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువ తకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆర్థి కంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 3 నుంచి నె లాఖరు వరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిం చింది. జిల్లాలో 12,131 యూనిట్లకు దరఖాస్తులు ఆహ్వా నించగా 52,839 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అ ర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ ఆవతరణ దినో త్సవం జూన్‌ 2 నుంచి 9వ తేదీ లోపు 50వేల నుంచి లక్ష రూపాయల లోపు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారు లకు చెక్కులను అందజేయాలని ప్రణాళికలు సిద్ధం చే శారు. అర్హుల జాబితాను అధికారులే ఎంపిక చేయాల ని ముందుగా ఆదేశాలిచ్చారు. కానీ ప్రభుత్వం మళ్లీ జి ల్లా ఇన్‌చార్జి మంత్రి అనుమతి తప్పని సరి చేయడం తో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చిం ది. దీంతో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం పెరి గి కమీషన్‌ వసూళ్లకు దారి తీసింది. ప్రాథమిక స్థాయి లో జరుగుతున్న అవకతవకలను గుర్తించిన ఇంటలీజె న్స్‌ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీని వల్ల జూ న్‌ 2న పంపిణీ చేయాల్సిన చెక్కులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంపిక ప్రక్రియను ప్రక్షాళన చేసి అర్హుల జాబితాను ఎంపిక చేయాలంటే అధికారులకు తలకు మించిన భారమవుతోంది. దీనికి తోడు త్వరలో రాన్ను స్థానిక సంస్థల ఎన్నికలు రాజీవ్‌ యువ వికాసానికి ప్ర తిబంధకంగా మారాయి. అర్హుల జాబితాలో కొందరికే మేలు జరిగితే మిగితావారు అసంతృప్తిలో ఉండి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రాజీవ్‌ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలవు తుందని అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. దీంతో రాజీవ్‌ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక మ రింత ఆలస్యం కానున్నది. దీంతో ఆర్జీదారుల్లో ఆందోళన మొదలైంది.

అంచనాకు మించి దరఖాస్తులు..

రాజీవ్‌ యువ వికాసానికి యువత నుంచి ఆహ్వానిం చిన దరఖాస్తులకు జిల్లాలో అంచనాలకు మించి దర ఖాస్తులు వచ్చాయి. లక్ష్యం 12,131 యూనిట్లకు దరఖా స్తులు ఆహ్వానించగా 52,839 మంది దరఖాస్తులు చేసు కున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికారు లకు కష్టతరంగా మారింది. ఎస్సీలకు 5,341 యూనిట్ల లక్ష్యం కాగా 17,596 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్టీలకు 1,644 యూనిట్లకు 4,204 మంది దరఖాస్తులు చేసుకున్నారు. బీసీలకు 3,907 యూనిట్ల లక్ష్యంగా కాగా 26,407 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈబీసీలకు 698 యూనిట్ల లక్ష్యం కాగా 1051 దరఖాస్తులు వచ్చా యి. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌కు 452 యూనిట్ల ల క్ష్యం కాగా 3,437 మంది దరఖాస్తులు చేసుకున్నారు. క్రి స్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి 89 యూనిట్లకు ల క్ష్యంగా కాగా 144 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇం దులో 50వేల నుంచి లక్ష లోపు రుణాలు ఇచ్చేందుకు 6,662 యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించి కేవలం 4,123 మం ది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. 2లక్షల నుంచి 4లక్షల రుణ మంజూరు కోసం 5,469 యూనిట్ల లక్ష్యా న్ని నిర్దేశించిగా 48,716 మంది దరఖాస్తు చేసుకున్నా రు ప్రభుత్వం తక్కువ రుణ సాయంతో ఎక్కువ మంది లబ్దిదారులకు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

వేదిస్తున్న సిబిల్‌ స్కోర్‌ సమస్య...

లబ్ధిదారుల ఎంపికలో సిబిల్‌ స్కోర్‌ సమస్య వేధి స్తోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సిబిల్‌ స్కోర్‌ తో సంబంధం లేదని ప్రకటించినప్పటికీ బ్యాంక్‌ అధి కారులు మాత్రమే బ్యాంక్‌ లింకేజీ ఉండే యూనిట్లకు సిబిల్‌ స్కోర్‌ తప్పనిసరి అని అంటున్నారు. దీంతో ఎ క్కువ మంది లబ్ధిదారులకు సిబిల్‌ స్కోర్‌ లేకపోవడం తో ఎంపిక ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీ ని వల్ల లబ్ధిదారుల్లో నైరాశ్యం నెలకొంది.

వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు..

ఈపథకంలో 21 ఏళ్ల నుంచి 55ఏళ్ల వారికి సర్కారు రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మరో వైపు వ్యవసాయ అనుబంధ రంగా ల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్టవయో పరిమితి 60ఏళ్లకు నిర్ణయించడంతో రైతులు ఈ పథ కం పట్ల ఎక్కువమంది ఆసక్తి చూపారు. ముఖ్యంగా పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లవంటి యూనిట్లకు దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటి ఏర్పాట్లలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పథకానికి అప్రతిష్టలేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేసేందుకు అధికా రులు కసర త్తు చేస్తున్నారు.

అర్హులను ఎంపిక చేయాలి...

గొడుగు విజయ్‌, ముత్యంపల్లి

రాజీవ్‌ యువ వికాసంలో దరఖాస్తు చేసుకున్న వారి లో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా నిరుద్యోగ యువకు లను అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. కొన్నేళ్లుగా కార్పొరేషన్‌ రుణాలు నిలిచిపో యాయి. ఈ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అ వకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jun 16 , 2025 | 11:36 PM