మరో 3 చోట్ల పురుగు మందుల పరీక్షా కేంద్రాలు
ABN, Publish Date - Feb 18 , 2025 | 03:43 AM
రాష్ట్రం లో మరో రెండు, మూడు చోట్ల పురుగు మందుల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అగ్రో కెమికల్స్ అసోసియేషన్, న్యూఢిల్లీ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
డీలర్లకు కంపెనీలు అందించే స్టాక్ వివరాలకు వెబ్‌సైట్: తుమ్మల
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో మరో రెండు, మూడు చోట్ల పురుగు మందుల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం అగ్రో కెమికల్స్ అసోసియేషన్, న్యూఢిల్లీ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కలుపు, పురుగు, తెగుళ్ల మందుల విక్రయాల గురించి, నకి లీ మందుల సరఫరా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా వారు అభినందించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురుగు మందుల విక్రేతలకు ఇచ్చే లైసెన్స్‌ల విధానాన్ని ఆన్‌లైన్ చేశామని, రానున్న కాలంలో మరో 2-3 కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కువ నమూనాలను పరీక్షించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు.
డీలరు విక్రయించిన పురుగు మందుల వివరాలు, కంపెనీలు డీలర్లకు అందించిన స్టాక్ వివరాలను తెలిపే విధంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు పొందడంపై సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్ర లక్ష్మిని.. మంత్రి తుమ్మల అభినందించారు. రాష్ట్రంలోని గిడ్డంగుల నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు సంస్థ 2024 స్కోచ్ అవార్డును సాధించింది. సచివాలయంలో అవార్డును మంత్రికి అందించారు.
Updated Date - Feb 18 , 2025 | 03:43 AM