Exam Schedule: మే12న ఈసెట్, జూన్ 6న లాసెట్
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:03 AM
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన లాసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఉన్నత విద్యామండలి వెల్లడి
హైదరాబాద్, కేయూ క్యాంపస్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన లాసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. శనివారం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ న్యాయ కాలేజీ ప్రిన్సిపాల్, లాసెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మూడు, ఐదేళ్ల వ్యవధిగల న్యాయవిద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను ఈనెల 25న విడుదల చేయనున్నారు.
మార్చి1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. మే 25 వరకు ఆలస్య రుసుంతో ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉంది. జూన్ 6న ప్రవేశ పరీక్ష ఉంటుందని లాసెట్ కన్వీనర్ ఆచార్య బి.విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా ఈసెట్ పరీక్ష దరఖాస్తులను మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు స్వీకరించనున్నారు. మే12న పరీక్ష ఉంటుందని ఈసెట్ కన్వీనర్ ఆచార్య పి.చంద్రశేఖర్ వెల్లడించారు.
Updated Date - Feb 09 , 2025 | 04:03 AM