ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG Law Admit Card: తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

ABN, Publish Date - Jun 01 , 2025 | 08:22 PM

TG Law Admit Card: ఇక, తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (TG LAWCET-2025), తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (TG PGLCET-2025) పరీక్షలు 2025, జూన్ 6వ తేదీన జరగనున్నాయి.

TG Law Admit Card

తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (TG LAWCET-2025), తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (TG PGLCET-2025)లకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. ది తెలంగాణ కౌన్సిల ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్(TCHE) ఆదివారం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ రెండు పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ lawcet.tgche.ac.in. నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..

  • లాసెట్ అధికారిక వెబ్ సైట్ అయిన lawcet.tgche.ac.in.లోకి వెళ్లండి.

  • అక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ సెక్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం ‘డౌన్‌లోడ్ హాల్ టికెట్’ అప్షన్‌ను క్లిక్ చేయండి.

  • మీ లాగిన్ డిటేల్స్ ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.

  • ఆ తర్వాత డౌన్‌లోడ్ హాల్ టికెట్‌పై క్లిక్ చేయండి.

  • మీ అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది.

  • మీరు మీ అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.

  • అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.


ఇక, తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (TG LAWCET-2025), తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (TG PGLCET-2025) పరీక్షలు 2025, జూన్ 6వ తేదీన జరగనున్నాయి. ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 10వ తేదీన విడుదల అవుతుంది. అభ్యర్థులు ఏదైనా అభ్యంతరం ఉంటే.. జూన్ 14వ తేదీలోగా తెలిపాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాలు, తుది ఆన్సర్ కీ జూన్ 25వ తేదీన విడుదల అవుతుంది.


ఇవి కూడా చదవండి

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

వదిన తల నరికి పోలీస్ స్టేషన్‌కు పట్టుకెళ్లిన మరిది

Updated Date - Jun 01 , 2025 | 08:22 PM