ఏడేళ్లలో రూ.2,148.45 కోట్లు
ABN, Publish Date - Jun 13 , 2025 | 03:38 AM
గత ప్రభు త్వ హయాంలో 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24వరకు బతుకమ్మ చీరల పథకం కోసం ప్రభుత్వం రూ.2,148.45కోట్లు ఖర్చు చేసినట్టు చేనేత, జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
బతుకమ్మ చీరల పథకానికి గత ప్రభుత్వ ఖర్చు ఇది
సహ చట్టం కింద వివరాలు
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): గత ప్రభు త్వ హయాంలో 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24వరకు బతుకమ్మ చీరల పథకం కోసం ప్రభుత్వం రూ.2,148.45కోట్లు ఖర్చు చేసినట్టు చేనేత, జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ఈ పథకం కోసం ఎక్కడ చీరలు కొన్నారు? టెండర్లలో పేర్కొన్న ధరలు, సరఫరా చేసిన సంస్థల వివరాలను యూత్‌ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అధ్యక్షుడు పల్నా టి రాజేంద్ర సమాచార హక్కు చట్టం కింద కోరగా..
ప్రభుత్వం ఏడేళ్లలో ఈ పథకం కోసం చేసిన ఖర్చు వివరాలను తెలియజేసింది. బతుకమ్మ చీరల పథకం కింద ప్రభుత్వం 2017-18లో రూ.222.48 కోట్లు, 2018-19లో రూ.280 కోట్లు, 2019-20లో రూ.303.50 కోట్లు, 2020-21లో రూ.317.81 కోట్లు, 2021-22లో రూ.333.14కోట్లు, 2022-23లో రూ.340కోట్లు, 2023-24 లో రూ.351.52 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది.
Updated Date - Jun 13 , 2025 | 03:38 AM