Naveen Mittal: విద్యుత్ అధికారులంతా ఆఫీసుల్లోనే ఉండాలి
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:06 AM
విద్యుత్ అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ కరెంటు సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు.
ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ కరెంటు సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ అఽధికారులను ఆదేశించారు. గతేడాదితో పోల్చితే ఈ వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని, ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. సోమవారం దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి అధికారులతో నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎండీ నుంచి జేఎల్‌ఎం దాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Updated Date - Jul 29 , 2025 | 04:06 AM