ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరు గ్యారెంటీలకు రూ.56 వేల కోట్లు

ABN, Publish Date - Mar 20 , 2025 | 05:35 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో రూ.56,083 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో ఇదే పథకాలకు చేసిన కేటాయింపులు రూ.49,315 కోట్లు కాగా చేసిన ఖర్చు చూస్తే రూ.24,948కోట్లు.

  • గత బడ్జెట్‌లో 49,315 కోట్ల కేటాయింపు.. ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో రూ.56,083 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో ఇదే పథకాలకు చేసిన కేటాయింపులు రూ.49,315 కోట్లు కాగా చేసిన ఖర్చు చూస్తే రూ.24,948కోట్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి గత ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినప్పటికీ రూ.52.90 కోట్లు ఖర్చు చేసింది. చేయూత పథకానికి గత బడ్జెట్‌లో రూ.14,861 కోట్ల ప్రతిపాదించగా.. రూ.12 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.9184కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది లేదు. రైతు భరోసాకు గత బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల ప్రతిపాదించగా.. మార్చి 31 నాటికి రూ.7500 కోట్లు ఖర్చు చేయనుంది. ఇదే పథకానికి ఈ సారి రూ.18వేల కోట్లను ప్రకటించింది.

పథకం కేటాయింపు

మహాలక్ష్మి 4,305

గృహజ్యోతి 2,080

సన్న ధాన్యానికి బోనస్‌ 1,800

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ 1,143

గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ 723

ఆత్మీయ భరోసా 600

ఇందిరమ్మ ఇళ్లు 12,571

చేయూత 14,861

రైతు భరోసా 18,000

Updated Date - Mar 20 , 2025 | 05:35 AM