TG Govt: ఎట్టకేలకు విద్యుత్ సంస్థలకు డైరెక్టర్లు
ABN, Publish Date - Jun 25 , 2025 | 08:03 AM
రాష్ట్రంలోని నాలుగు విద్యా సంస్థల (తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)కు 16మంది డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
16 మంది నియామకానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు విద్యా సంస్థల (తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)కు 16మంది డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని పేర్కొంటూ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు దీరగానే డిస్కమ్‌ల్లోని డైరెక్టర్లకు ఉద్వాసన పలికి, ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో డైరెక్టర్లుగా ఉన్న వారిని ఇన్‌చార్జీలుగా కొనసాగించింది. కొత్త డైరెక్టర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరించిన విద్యుత్‌శాఖ.. ఇటీవలే ఇంటర్వ్యూలు పూర్తిచేసి.. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లను పంపితే వారిలో ఒక్కొక్కరిని ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు.
Updated Date - Jun 25 , 2025 | 08:05 AM