ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Technical Issues: ఎల్‌ఆర్‌ఎస్‌ షార్ట్‌ఫాల్‌ పత్రాలు..అప్‌లోడ్‌ కావట్లే

ABN, Publish Date - Mar 19 , 2025 | 06:21 AM

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో సాంకేతిక సమస్యలు క్రమేణా పెరుగుతున్నాయి. రుసుము నిర్ధారణ, దరఖాస్తుల..

  • రుసుము నిర్ధారణ, పరిశీలనలో ఇప్పటికే

  • పలు ఇబ్బందులు.. పెరుగుతున్న సమస్యలు

  • ఫోన్‌నంబర్‌కు మెసేజీలు రాని పరిస్థితి

  • ఆన్‌లైన్‌లో చెక్‌ చేస్తేనే సమాచారం

  • హెల్ప్‌డె్‌స్కల వద్ద కూడా పౌరులకు నిరాశే

  • ఏం చేయలేమని చేతులెత్తేస్తున్న సిబ్బంది

  • సమస్యల్ని పట్టించుకోని పురపాలక శాఖ

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో సాంకేతిక సమస్యలు క్రమేణా పెరుగుతున్నాయి. రుసుము నిర్ధారణ, దరఖాస్తుల పరిశీలనలో ఇప్పటికే పలు ఇబ్బందులు ఉండగా.. తాజాగా షార్ట్‌ఫాల్‌ డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయడం కూడా సవాల్‌గా మారుతోంది. ఒకటికి నాలుగుసార్లు ప్రయత్నించినా పోర్టల్‌లో పత్రాలు అప్‌లోడ్‌ కావట్లేదు. దీంతో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని హెల్ప్‌డెస్క్‌ల వద్దకు దరఖాస్తుదారులు పరుగులు తీస్తున్నారు. కానీ, అక్కడా వారికి నిరాశే ఎదురవుతోంది. ‘ఈ విషయంలో మేమేం చేయలేం. సాంకేతిక సమస్యలున్నాయి.. అప్‌లోడ్‌ అయ్యేదాకా ప్రయత్నించండి’ అని అక్కడి సిబ్బంది సలహా ఇస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏతోపాటు అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుము చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే ఇంకా 12 రోజులే గడువు మిగిలి ఉంది. ఇంతటి కీలకసమయంలో సమస్యలు తలెత్తుతండడం.. ఏం చేయాలో తోచక దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. జీహెచ్‌ఎంసీలో 1.06 లక్షలు, శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఆరు లక్షలకు పైగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులున్నాయి. వారిలో 60ు దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపు సమాచారం వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 శాతం మంది.. అధికారులు అడిగిన పత్రాల ను (షార్ట్‌ఫాల్‌ డాక్యుమెంట్లను) సమర్పించా ల్సి ఉంది. కానీ రుసుము చెల్లింపు, పత్రా ల అప్‌లోడ్‌కు సంబంధించిన ఎస్సెమ్మె్‌సలు దరఖాస్తుదారుల ఫోన్లకు రావట్లేదు. ఆన్‌లైన్‌లో చూసుకుంటే తప్ప దరఖాస్తు స్థితి తెలియట్లేదు. అలా చూసుకునే అవగాహన లేక చాలా మంది తీవ్రంగా ఇబ్బందిపడుతున్నా రు.


కొన్ని మునిసిపాలిటీల సిబ్బంది మాత్రం.. దరఖాస్తుదారులకు ఫోన్‌చేసి, రుసుము చెల్లించాలని సూచిస్తున్నారు. కాగా.. దరఖాస్తుదారుల్లో ఇప్పటివరకూ రరుసుము చెల్లించినవారు 8 నుంచి 10 శాతంలోపే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిర్ధారణలో వ్యత్యా సం ఉండడం.. రుసుము చెల్లింపుపై దరఖాస్తుదారుల వెనకడుగుకు ఒక ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు.. కిస్మత్‌పురాలో 250 చదరపు గజాల ప్లాట్‌కు రూ.19 వేలు, అదే ప్రాం తంలోని 116 గజాలకు రాయితీ పోను రూ.38 వేలు రుసుము నిర్ధారిస్తూ ‘ఫీ ఇంటిమేషన్‌ లెటర్‌’ వచ్చింది. తక్కువ రుసుము వచ్చిన వ్యక్తి.. ‘‘ఇంత తక్కువ ఫీజు ఎందుకు వచ్చింది? ఇప్పుడు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తారా? లేక మరోసారి రుసుము చెల్లించాల్సి ఉంటుం దా?’’ అని సందేహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. మరోవైపు.. రుసుము చెల్లించినవారి వివరాలు ఇప్పటికీ సంబంధిత కార్పొరేషన్‌, మునిసిపాలిటీ లాగిన్‌లోకి రాకపోవడం గమనార్హం. ఈ సమస్యలను పురపాలక శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. రాయితీతో రుసు ము చెల్లింపునకు గడువు ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా వారు స్పందించి, సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.



2015 దరఖాస్తులు పెండింగ్‌లోనే..

హెచ్‌ఎండీఏ పరిధిలో 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు సైతం ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఆ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను 2018 నుంచి నిలిపివేయడంతో అప్పట్నుంచీ అధికారులు హెచ్‌ఎండీఏ ఎల్‌ఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ లాగిన్‌ను మూసివేశారు. దరఖాస్తు కోసం రూ.10 వేల చొప్పున చెల్లించిన రుసుమును కూడా దరఖాస్తుదారులకు తిరిగి ఇవ్వలేదు. అయినా వారు 2020 ఎల్‌ఆర్‌ఎస్‌ సమయంలో మరోసారి రూ.1000 చెల్లించి దరఖాస్తు చేశారు. తమ దస్త్రాలను సత్వరం పరిష్కరించాలని ఇప్పుడు వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ఆయా ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు చెల్లించాలనే సమాచారం కూడా వస్తోంది. ఫీజు చెల్లించేందుకు తాము సిద్ధమేనని.. అయితే, నాడు తాము చెల్లించిన రూ.10 వేల రుసుమును ఇప్పుడు సర్దుబాటు చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. లేదా ఆనాటి దరఖాస్తుల పరిష్కారానికైనా మోక్షం కలిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 06:22 AM