సమ్మర్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోండి
ABN, Publish Date - May 03 , 2025 | 10:56 PM
వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందు తూ పాఠ్య పాఠ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
జిల్లా స్థాయి క్యాంపు ప్రారంభోత్సవంలో కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఏప్రిల్ మే 3 (ఆంధ్రజ్యోతి) : వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందు తూ పాఠ్య పాఠ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ పట్టణంలోని కస్తూర్భా బాలికల విద్యాల యంలో శనివారం జిల్లా స్థాయి బాలికల సమ్మర్ క్యాంప్‌ను జ్యోతి ప్రజ్వళన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్ ్స, డ్యాన్స్, మ్యూజిక్, యోగ, మెడిటేషన్, కంప్యూటర్, కోడింగ్, పెయిం టింగ్స్ మొదలైన అంశాలు ఈ సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక విద్యార్థి ఈ శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న వివిధ అం శాలు జీవితంలో ఎదగడానికి ఉపకరిస్తాయన్నారు. జిల్లాలోని 18 కేజీబీవీల నుంచి దాదాపు 200 మంది విద్యా ర్థినులు శిక్షణకు రావడానికి కృషి చేసిన స్పెషల్ ఆపీసర్లను, టీచర్‌లను కలెక్టర్ అభినందించారు. ఈ క్యాంప్ పది హేను రోజులపాటు సక్రమంగా నడిపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శా ఖ కోఆర్డినేటర్లు చౌదరి యశోదర, సత్యనారాయణమూర్తి, నస్పూర్ మండల విద్యాధికారి దామోదర్ రావు, క్యాంప్ కోఆర్డినేటర్ నస్పూర్ స్పెషల్ ఆఫీసర్ మౌనిక, అసిస్టెంట్ క్యాంప్ కోఆర్డినేటర్ స్వర్ణలత, జిల్లాలోని వివిధ కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 10:56 PM