సమస్యలకు నిలయం సుందరయ్య కాలనీ
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:17 AM
జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి సమీపంలోని సుందరయ్య కాలనీలో విద్యుత సమస్యలు నెలకొన్నాయి. గాలి దుమారంతో పాటు వానలు వస్తే విద్యుత తీగల నుంచి మంటలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలకు నిలయం సుందరయ్య కాలనీ
నల్లగొండ, జూన 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి సమీపంలోని సుందరయ్య కాలనీలో విద్యుత సమస్యలు నెలకొన్నాయి. గాలి దుమారంతో పాటు వానలు వస్తే విద్యుత తీగల నుంచి మంటలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33/11కేవీ విద్యుత వైర్లతో పాటు హైటెన్షన, లోటెన్షన వల్ల కాలనీ మొత్తం అనేక సార్లు విద్యుత సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రధానంలో లోవోల్టేజీ, హై వోల్టేజీతో కారణంగా తరచుగా కరెంట్ పోతున్నా విద్యుతశాఖ అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కాలనీకి వచ్చి చూసి పోవడం మినహా సమస్యను పరిష్కరించడం లేదని విమర్శించారు. కాలనీలో పలు చోట్ల స్తంభాలు ఒరిగిపోయి తీగలు వేలాడుతున్నాయి. కొత్త స్తంభాలు వేసి తీగలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసినా పరిష్కరించకపోవడంతో స్థానికులు విసిగి వేసారిపోతున్నారు. హైటెన్షన విద్యుత సరఫరాతో షార్ట్ సర్క్యూట్‌తో ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. పలుమార్లు టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఇంటి సంపులో ఉండే మోటార్లు, బోరుబావుల్లోని మోటార్లు కాలిపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. సుందరయ్య కాలనీకి ఆర్జాలబావి ప్రాంతం నుంచే మెయిన లైన వెళ్లింది. అయితే విద్యుత శాఖ అధికారులు లోపాలను సరిదిద్దక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
కోతులు బాబోయ్...కోతులు
సుందరయ్య కాలనీలో కోతుల బెడద తీవ్రంగా మారింది. ఈ కాలనీ సమీపం నుం చే ఎస్‌ఎల్‌బీసీ కాల్వ ఉంది. దీనికి తోడు కంపచెట్లు అధికంగా ఉండటం అంతేకాక సమీపంలో పొలాలు ఉండటంతో కోతులు అత్యధికంగా తిరుగుతూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. కాలనీలో నుంచి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని, చిన్న పిల్లలను కోతులు వెంటాడుతుండటంతో ప్రజలు భయాందోళన కు గురవుతున్నారన్నారు. కోతులను తరలించాలని అనేక సార్లు మునిసిపల్ అధికారులక ు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు వీధి కుక్కలు సైతం స్వైరవిహారం చేస్తున్నాయి. ఆ సమస్యను మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అదేవిధంగా ఎస్‌ఎల్‌బీసీ కాలనీకి ప్రహారి నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గతంలో ఇద్దరు పిల్లలు దురదృష్టవశాత్తు నీటిలో పడి మరణించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి స్థానికులు తమ పిల్లలను బయటకు పంపించాలంటే భ యపడుతున్నారు. ఇప్పటికైనా కాలనీలో విద్యుత సమస్యను పరిష్కరించాలని, కోతుల బెడదను తొలగించాలని కోరుతున్నారు.
విద్యుత సమస్యలను పరిష్కరించాలి
సైదులు, సుందరయ్య కాలనీ
కాలనీలో నెలకొన్న విద్యుత సమస్యను పరిష్కరించాలి. ఒరిగిన పాత స్తం భాల స్థానంలో కొత్త వాటి ని ఏర్పాటు చేయాలి. అధికారులకు ఫిర్యాదు చేస్తే వచ్చి చూసి వెళ్తున్నా రు. కానీ సమస్యను పరిష్కరించడం లేదు. లోవోల్టేజీ, హైవోల్టోజీ సమస్యలతో పలు ఇళ్లలో గృహోపకరణాలు కాలిపోయాయి. తక్షణమే విద్యుత సమస్య పరిష్కారంపై విద్యుతశాఖ అధికారులు దృష్టి సారించి కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలి.
కోతులతో ఇబ్బందులు వస్తున్నాయి
మంగమ్మ, స్థానికురాలు
కాలనీలో కోతుల బెడద తీవ్రమైంది. దీంతో పిల్లలకు, పెద్దలకు కోతుల వల్ల గాయాలయ్యాయి. ఈ విషయాన్ని మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కోతులను తరలించాలని కోరాం. అయినా పట్టించుకోవడం లేదు. కాల్వ వెంట ఉన్న కంపచెట్లను తొలగించాలి. విష సర్పాలు, తేళ్లు వస్తుండటంతో పిల్లలు, పెద్దలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలో సమస్యలు మరింత అధికమవుతున్నాయి. అధికారులు కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి.
Updated Date - Jun 26 , 2025 | 12:17 AM