బవిద్యార్థుల విజ్ఞానానికి వేసవి శిబిరాలు దోహదం
ABN, Publish Date - May 08 , 2025 | 11:16 PM
బవిద్యార్థుల విజ్ఞానానికి వేసవి శిబిరాలు దోహదంSummer camps contribute to knowledge
- డీఈవో రమేష్ కుమార్
తెలకపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి) : వేసవి సెలవు ల్లో విజ్ఞానంతో పాటు వినోదా న్ని పొందుతూ విద్యాయేతర నైపుణ్యాలను పెంపొందించు కోవడానికి అవకాశం సమ్మర్ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్‌కుమార్ అన్నారు. గు రువారం తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో కొనసాగుతున్న వేసవి శిక్షణా తరగతు ల శిబిరాన్ని డీఈవో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ క్యాంప్‌లో స్పోకెన్ ఇంగ్లిష్, స్పీడ్ మ్యాథ్స్, డ్యాన్స్, మ్యూజిక్, యోగ, మెడి టేషన్, కంప్యూటర్, కోడింగ్, పెయింటింగ్స్ మొ దలైన అంశాలు ఈ సమ్మర్ క్యాంపులో శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 29జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నా రు. వేసవి శిబిరాల్లో విద్యార్థులకు అందించే అల్పాహారాన్ని డీఈవో పరిశీలించారు.
Updated Date - May 08 , 2025 | 11:16 PM