ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలి

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:05 PM

విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలని, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని తె లంగాణ సాంఘీక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సం తోష్‌కుమార్‌ అన్నారు. సోమవారం పాఠశాలలో స్టూడెంట్‌ అకాడమిక్‌ యా క్టివిటిలో భాగంగా స్కూల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికలను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌, ఎస్‌ఐ

బెల్లంపల్లి,జూన్‌30(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలని, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని తె లంగాణ సాంఘీక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సం తోష్‌కుమార్‌ అన్నారు. సోమవారం పాఠశాలలో స్టూడెంట్‌ అకాడమిక్‌ యా క్టివిటిలో భాగంగా స్కూల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ప్రజా పద్ధతిలో ఎన్నికల నిర్వహణ కోసం విద్యార్థులకు ఓటు హక్కు కల్పించారు. నలుగురు వైస్‌ కెప్టెన్‌లు, నలుగురు కెప్టెన్‌లు పో టీలో నిలబడ్డారు. పోలింగ్‌ ఆఫీసర్‌, బూత్‌ ఏజెంట్లను మైక్రో అభ్యర్థులను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో విద్యా ర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థి దశ నుంచే ఎన్ని కలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రజా పద్ధ తిలో ఎన్నికలు నిర్వహించామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లగురిజాల ఎస్‌ఐ రమేశ్‌, అధ్యాపకులు నరేందర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, మంజుల, శైలజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:05 PM