ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- విద్యార్థుల వివరాలు అందజేయాలి

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:11 PM

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు, మహాత్మాజ్యోతిబాఫూలే పాఠశాలలు, మైనార్టీ విద్యాలయాలో చదివే విద్యార్థులకు నాణ్యమైన కోడి గుడ్లు అందించేందుకు వివరాలు అందజేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి జిల్లా స్థాయి గుడ్ల సేకరణ కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, పాల్గొన్న అదనపు కల్టెర్‌ దీపక్‌ తివారీ

ఆసిఫాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు, మహాత్మాజ్యోతిబాఫూలే పాఠశాలలు, మైనార్టీ విద్యాలయాలో చదివే విద్యార్థులకు నాణ్యమైన కోడి గుడ్లు అందించేందుకు వివరాలు అందజేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి జిల్లా స్థాయి గుడ్ల సేకరణ కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన కోడి గుడ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం మినహాయించిన అన్ని విద్యాయలయాలకు గుడ్లను సరఫరా చేయడం కోసం అవసరమైన ఈ-టెండర్‌ నిర్వహణ కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరం ఉంటుందో వివరాలు వెంటనే అందించాల న్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నదీమ్‌ అహ్మద్‌, గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సురేష్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి అశ్వాక్‌హుస్సేన్‌, ఎస్సీ అభివృద్ధి అదికారి సజీవన్‌ సంక్షేమాధికారులు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలి

ఆసిఫాబాద్‌,(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలోని వీసీ హాల్‌ నుంచి శక్రవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి వీడియో కార్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, మూడు నెలల సన్నబియ్యం పంపిణీ, వన మహోత్సవం మొక్కలు నాటుట, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వర్షాకాలంలో వ్యాధులను నియంత్రణ, గురకులాల పర్యవేక్షణ, పంచాయతీలలో పారిశుధ్యం, వానాకాలంలో యూరియా, డీఏపీలను అవసరమైన మేరకు సమకూర్చడం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవన్యూ సదస్సులలో జిల్లాలో 4,200 దరఖాస్తులు వచ్చాయని, ప్రతి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబందనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తిరస్కరించినట్లయితే తిరస్కరణకు సంబంధించిన కారణాలను దరఖాస్తుదారుఇకి వివరించాలన్నారు. న్యాయ పరంగా పరిష్కరించే దరఖాస్తులను ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని, ప్రతి దరఖాస్తుదారుడిక ఇనోటీసులు అందించి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. సన్న బియ్యం పంపిణీలో మూడు నెలల కోటా సీఎంఆర్‌ బియ్యం సంబందిత రైస్‌ మల్లుల యజమానులతో సమీక్షించాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉందన్నారు. అలాగే ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, డీపీవో భిక్షపతి, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, వ్యవసాయ శాఖ ఏడీ మిలింద్‌, హౌజింగ్‌ పీడీ వేణుగోపాల్‌, జిల్లాలోని తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, హౌసింగ్‌ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యాధికారులు, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:11 PM