ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad-పెన్షన్ల కోసం పడిగాపులు

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:25 PM

చేయూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) నిబంధనతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు వద్ద దివ్యాంగ, వితంతు, వృద్ధాప్య, తదితర పెన్షన్‌దారులు బుధవారం గంటల కొద్ది పడిగాపులు పడాల్సి వచ్చింది.

పోస్టాఫీసు వద్ద పడిగాపులు కాస్తున్న పింఛన్‌దారులు

ఆసిఫాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): చేయూత పథకం కింద అందిస్తున్న పింఛన్ల పంపిణీలో ఫేస్‌ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) నిబంధనతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు వద్ద దివ్యాంగ, వితంతు, వృద్ధాప్య, తదితర పెన్షన్‌దారులు బుధవారం గంటల కొద్ది పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం పింఛన్‌ పంపిణీలో చేయూత యాప్‌లో ముఖ గుర్తింపు తప్పని సరి చేసింది. దీంతో పెన్షన్‌ పంపిణీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నది. గతంలో వేలిముద్రల ఆధారంగా అధికారులు పెన్షన్‌ పంపిణీ చేసేవారు. అందులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల నుంచి ముఖ గుర్తింపు ఆధారంగా పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు. దీంతో పెన్షన్‌దారులు గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేద్రంలోని పోస్టాఫీసు సిబ్బంది ప్రతి నెల పెన్షన్‌ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు పోస్టాఫీసు సిబ్బందికి ట్యాబ్‌లు పంపిణీ చేయలేదు. దీంతో సిబ్బంది మొబైల్‌లోనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని లబ్ధిదారుల ఫొటోలను అప్‌లోడ్‌ చేసి పెన్షన్‌ చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చేయూత యాప్‌లో ఫొటో అప్‌లోడ్‌ సందర్భంలో కొంత మంది పెన్షన్‌ దారుల ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ లేక పోవడంతో వారి వివరాలను యాప్‌లో తీసుకోవడం లేదు. దీంతో పెన్షన్‌ దారులు వెనుతిరిగి పోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. పోస్టాఫీసు వద్ద ఇరుకు సందులో కౌంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని పెన్షన్‌దారులు కోరుతున్నారు. ఈ విషయమై సబ్‌ పోస్టుమాస్టర్‌ అవినాష్‌కుమార్‌ను వివ రణ కోరగా యాప్‌లో వివరాల నమోదు చేయడం ద్వారా ఆలస్యమవుతున్నదని తెలిపారు.

Updated Date - Jul 30 , 2025 | 11:25 PM