ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి

ABN, Publish Date - May 30 , 2025 | 11:34 PM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. చెన్నూరు పట్టణంలో రూ. 13 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను వుక్రవారం ప్రారంభించారు.

చెన్నూరు బస్తీ దవాఖానాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి

చెన్నూరు, మే 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. చెన్నూరు పట్టణంలో రూ. 13 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను వుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రజలకు మెరుగైన వైద్య అందించాలని బస్తీ దవాఖానాను ప్రారంభించామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలోని ప్రజల వైద్యంపై దృష్టి సారించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపుతుందన్నారు. దవాఖానాకు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదగా ఉండాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:34 PM