ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చేనేత రిజర్వేషన్లు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:03 AM

చేనేత రిజర్వేషన్‌ యాక్ట్‌ - 1985 ప్రకారం చేనేతకు కేటాయించిన 11రకాల రిజర్వేషన్లను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెన్నైలోని డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఫర్‌ హ్యాండ్లూమ్స్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ముజేంద్రనాథ్‌, దీపక్‌ అన్నారు.

మాట్లాడుతున్న డీసీహెచ్‌ చెన్నై రీజనల్‌ ఆఫీస్‌ అధికారి ముజేంద్రనాథ్‌

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): చేనేత రిజర్వేషన్‌ యాక్ట్‌ - 1985 ప్రకారం చేనేతకు కేటాయించిన 11రకాల రిజర్వేషన్లను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెన్నైలోని డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఫర్‌ హ్యాండ్లూమ్స్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ముజేంద్రనాథ్‌, దీపక్‌ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి చేనేత సహ కార సంఘం భవనంలో ఎన్‌హెచ్‌డీసీ ఆధ్వర్యంలో మంగళవారం భూదాన్‌ పోచంపల్లి బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌ నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. పోచంపల్లి ఇక్కత్‌కు కేటాయించిన జీఐఏ (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ యాక్ట్‌) అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏ ప్రాంతంలోని వస్త్రోత్పత్తులు ఆ ప్రాంతంలోనే తయారు చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు దాడులు జరిపి చర్యలు తీసుకుంటారని అన్నారు. అంతేగాక చేనేతకు కేటాయించిన 11రకాల రిజర్వేషన్లను కాపీ కొట్టడం కానీ, డూప్లికేషన్‌ చేయడం కానీ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇతర రాష్ట్రాల్లోగాని, ఇతర దేశాల్లోగాని చేనేత రిజర్వేషన్లు కాపీ కొడితే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. చేనేతకు రిజర్వు చేసిన వస్త్ర రకాలు ఏప్రాంతానికి చెందినవి ఆ ప్రాంతంలోనే తయారు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో తయారు చేయడం నేరమ న్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో చేనేత, జౌళాశాఖ రీజినల్‌ డిప్యుటీ డైరెక్టర్‌ పద్మ, జిల్లా సహా య సంచాలకులు శ్రీనివాస్‌రావు, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు రాజేశ్వర్‌రెడ్డి, రంజిత్‌, మేనేజర్‌ రుద్ర ఆంజనేయులు, చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు భారత లవకుమార్‌, చేనేత నాయకుడు తడక రమేష్‌ ఉన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:03 AM