ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- మౌలిక వసతుల కల్పనకు చర్యలు

ABN, Publish Date - Jun 28 , 2025 | 11:15 PM

ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని - రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ అయేషా మస్రత్‌ఖానం అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అంకుశాపూర్‌లో గల ప్రభుత్వ వైద్య కళాశాలను శనివారం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేతో కలిసి సందర్శించారు.

వైద్య కళాశాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ అయేషా మస్రత్‌ఖానం, పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని - రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ అయేషా మస్రత్‌ఖానం అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అంకుశాపూర్‌లో గల ప్రభుత్వ వైద్య కళాశాలను శనివారం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేతో కలిసి సందర్శించారు. కళాశాలోని గదులు, తరగతి గదుల పరిశీలన జరిపి విద్యార్థులతో మాట్లా డి సౌకర్యాలు, విద్యాబోధన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలో వైద్య కళాశాలలో బోధనకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమిస్తామన్నారు. ఒప్పంద పద్ధతిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌, ఇతర సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాల భవన పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు త్వరలో వసతి గృహాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల భవనం పూర్తి చేసి ఒకే ప్రాంతంలో ఉండే విధంగా వైద్య విద్యార్థులకు వసతి గృహాన్ని త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి డయాలసిస్‌ కేంద్రం, ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌ గదులను పరిశీలించి ఽఅధికారులకు సూచనలు చేశారు. ఆసుపత్రికి వైద్య కోసం వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మి, ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్యులు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:15 PM