ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN, Publish Date - Jun 27 , 2025 | 01:05 AM

ప్రభుత్వం నిషేదించిన గంజాయి, గుట్కా, మత్తు పదార్ధాలకు యువతి యువకులు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ తెలిపారు.

ప్రతిజ్ఞ చేస్తున్న పోలీసులు, మహిళా సంఘాలు

బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌

మందమర్రి టౌన్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి: ప్రభుత్వం నిషేదించిన గంజాయి, గుట్కా, మత్తు పదార్ధాలకు యువతి యువకులు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ తెలిపారు. గురువారం పట్టణంలో మాదకద్రవ్య నిర్మూలన అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్తుకు బానిసలైన చాలా మంది బంగారు భవిష్యత్‌ను కోల్పోతున్నారన్నారు. దేశ ప్రగతికి యువతే మూల స్థలంభాలనే విషయాన్ని విస్మరించవద్దని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఈ మద్య కాలంలో చాలా మంది యువతి యువకులు మత్తు పదార్ధాలకు అలవాటై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు. బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలో ప్రత్యేక దృష్టి పెట్టి విక్రయిస్తున్న చాలా మందిని అరెస్టు చేశామని అన్నారు. దీనికి బానిసైలన వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చామన్నారు. ఇలాంటి పదార్ధాలు సేవించే వారు విచక్షణ కోల్పోతారని, చిన్న వయస్సులోనే చనిపోతారని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఈ మత్తు పదార్ధాల నుండి విముక్తి కలిగించేందుకు రామగుండం సీపీ, మం చిర్యాల డీసీపీ ఆదేశాల మేరకు ర్యాలీలు నిర్వహిఉ్తన్నట్లు తెలిపారు. ఎవరైనా గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తే తమ దృష్టికి తేవాలన్నారు. మంచి సమాజ నిర్మాణం కోసం పని చేసే ప్రతి ఒక్కరు పోలీసులే అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బెల్లంపల్లి డివిజన్‌లో వీటిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక బృంధాలుగా ఏర్పడి ఎక్కడ కూడా విక్రయించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎక్కడైనా డ్రగ్స్‌ విక్రయిస్తే సమాచారాన్ని 1908కు ఫోన్‌ చేసి తెలపాలని కోరారు. అనంతరం పట్టణంలోని మార్కెట్‌ ఏరియాలో వివిధ రకాల స్లోగన్‌లతో కూడిన ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక సింగరేణి పాఠశాల మైదానం వరకు కొనసాగింది. అనంతరం విద్యార్ధులతో ప్రతీజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్‌, జీఎం దేవేందర్‌, ఎస్‌వోటూ జీఎం విజయప్రసాద్‌, గుర్తింపు సంఘం నాయకులు సలేంద్ర సత్యనారాయణ, విద్యార్ధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 01:05 AM