గోదావరి-కృష్ణా వరదలపై అధ్యయనం
ABN, Publish Date - Jan 23 , 2025 | 03:51 AM
వరదల సమయంలో ప్రభావిత రాష్ట్రాలతో సమన్వ యం చేసుకుంటూ సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ డ్యామ్ సేఫ్టీ కమిటీలు నిర్ణయించాయి.
ఐఐటీ రూర్కీ, హైదరాబాద్‌తో స్టడీ
రాష్ట్రాల సమన్వయంతో గేట్ల ఆపరేషన్
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నిర్ణయం
హైదరాబాద్, జనవరి 22(ఆంధ్రజ్యోతి): వరదల సమయంలో ప్రభావిత రాష్ట్రాలతో సమన్వ యం చేసుకుంటూ సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ డ్యామ్ సేఫ్టీ కమిటీలు నిర్ణయించాయి. బుధవా రం వర్చువల్‌గా ఈ సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ (జనరల్), స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎ్‌సవో) చైర్మన్ జి.అనిల్‌కుమార్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) జి.విజయభాస్కర్‌రెడ్డి, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజనీర్ విజయ్ ఘాగరే, సీ డబ్ల్యూసీ డైరెక్టర్ (సౌత్-హైడ్రాలజీ) నిత్యానందరాయ్, కర్ణాటక జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ మంజునాథ్, ఏపీ జలవనరుల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రాజేంద్రప్రసాద్, ఓయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.రాజశేఖర్, జేఎన్‌టీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్.శ్రీనివాసులు హాజరయ్యారు. రాష్ట్రాల మధ్య వరదలపై కచ్చితమైన సమాచార మా ర్పిడి లేక ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల ఆపరేషనల్ ప్రొటోకాల్‌లో ఇబ్బందులొస్తున్నాయని గుర్తించారు.
మహారాష్ట్ట్రలో ఆకస్మిక వరదలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకింద ఉన్న కాళేశ్వరంలోని ప్యాకేజీ-21కు చెందిన పంప్‌హౌస్ నీట మునిగిందని, విజయవాడ కూడా వరదలతో ప్రభావితమైం దని, మహారాష్ట్రలోని నాందేడ్ కూడా ఎస్‌ఆర్‌ఎస్పీలో వరదల సమయంలో గేట్లు ఎత్తకపోవడంతో ముంపునకు గురైందని గుర్తించారు. దీని కోసం గోదావరి, కృష్ణా నదుల క్యాచ్‌మెంట్ ఏరియాలో ఫ్లడ్ రూటింగ్‌పై ఐఐటీ -హైదరాబాద్, ఐఐటీ-రూర్కీతో అధ్యయనం చేయించి, ప్రాజెక్టు ల గేట్ల ఆపరేషనల్ ప్రొటోకాల్‌ను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రియల్‌టైమ్ రెయిన్‌ఫాల్ డాటాను రాడార్, శాటిలైట్ ఆధారంగా పంచుకోవడం, అత్యాధునిక విధానాల తో గేట్ల ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. వాతావరణ మార్పుల సమాచారం ఆధారంగా రిజర్వాయర్ల నిర్వహణ చేపట్టాలని గుర్తించారు. కాగా, ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టు నిరుడు జూలై 18న వరదలతో కట్టతెగిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టు స్పిల్ వే సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. జాతీ య ఆనకట్టల భద్రతసంస్థ(ఎన్‌డీఎస్‌ఏ) సిఫారసుల అనంతరమే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు/పునరుద్ధరణ చేపట్టాల ఈ భేటీలో నిర్ణయించారు. రాష్ట్రంలో వానాకాలానికి ముందు, వానాకాలం తర్వాత ప్రాజెక్టుల స్థితిగతులపై నిర్ణీత వ్యవధిలోగా నివేదికలను సిద్ధం చేసి, ధర్మపోర్టల్ (ఎన్‌డీఎ్‌సఏ) పొందుపరచాలని నిర్దేశించారు.
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Updated Date - Jan 23 , 2025 | 03:51 AM