ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Construction: రహదారులకు మహర్దశ !

ABN, Publish Date - Feb 07 , 2025 | 04:19 AM

మండల కేంద్రం నుంచి జిల్లాకు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు రహదారుల నిర్మాణంపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ(ఆర్‌ అండ్‌ బీ) దృష్టి సారించింది.

  • 3 దశల్లో 12,000 కిలోమీటర్ల రోడ్ల పనులు

  • 96 నియోజకవర్గాల్లో రోడ్ల గుర్తింపు

  • ‘హ్యామ్‌’ విధానంలో పనులకు ఆర్‌ అండ్‌ బీ కసరత్తు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి జిల్లాకు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు రహదారుల నిర్మాణంపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ(ఆర్‌ అండ్‌ బీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 96 నియోజకవర్గాల్లోని 12,000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులను మూడు దశల్లో పూర్తి చేసేందుకు ఓ రూట్‌ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసింది. నిజానికి, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, గిరిజన శాఖ పరిధిలో దాదాపు 30వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీ రాజ్‌ శాఖను నోడల్‌ ఏజెన్సీగా ఏర్పాటు చేసి ఏ శాఖ పరిధిలోని రహదారులను ఆ శాఖలే పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే, హైబ్రీడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో పనులు చేపట్టాలని సూచించింది. హ్యామ్‌ విధానంలో రోడ్ల పనులు నిర్వహించేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం 40శాతం నిధులు అందిస్తుంది. మిగిలిన 60 శాతాన్ని బ్యాంకు రుణాలు తీసుకుని పనులు చేపట్టేలా ఒప్పందాలు జరగనున్నాయని సమాచారం. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ సుమారు 10-15ఏళ్ల పాటు రహదారి నిర్వహణ చూసుకునేలా ఒప్పందం ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అమల్లో ఉన్న కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింట్‌నెన్స్‌ ప్రోగ్రామ్‌ (సీఆర్‌ఎంపీ) విధానంలోనే ఇది అమలుకానున్నట్టు తెలిసింది. అయితే, ఏదైనా మార్గంలో టోల్‌ ఏర్పాటు ఉంటుందా? అనే అంశం డీపీఆర్‌లు సిద్ధమైన తర్వాతే తెలుస్తుంది.


ఏప్రిల్‌లో టెండర్లు

ఆర్‌ అండ్‌ బీ పరిధిలో 96 నియోజకవర్గాలలోని 12వేల కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన పనులను మూడు దశల్లో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 4,600 కి.మీ, రెండో విడతలో 4,600కి.మీ, మూడో దశలో 2,800 కిలోమీటర్ల చొప్పున పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. వీటిల్లో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్లు, జిల్లా కేంద్రం నుంచి రాజధాని వరకు రెండు నాలుగు లేన్లను నిర్మించనున్నారు. వీటి అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌) తయారీ బాధ్యతను ఇప్పటికే ఓ సంస్థకు అప్పగించారు. తొలి దశలో చేపట్టే పనులకు సంబంధించిన డీపీఆర్‌లను మార్చి చివరి వారం లోగా అందజేయాలని ఆ సంస్థకు సూచించారు. అనంతరం ఏప్రిల్‌ మొదటి వారంలో పనుల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించాలని ఆర్‌అండ్‌ బీ లక్ష్యంగా పెట్టుకుంది.


నియోజకవర్గాల వారీగా రోడ్ల గుర్తింపు..

హ్యామ్‌ విధానంలో నిర్మించబోయే రహదారుల సమగ్ర వివరాలను నియోజకవర్గాల వారీగా అధికారులు సేకరించారు. ప్రాధమిక వివరాల ప్రకారం.. మానుకొండూరు నియోజకవర్గంలో అత్యధికంగా 241.79కి.మీ మేర రహదారి పనులు నిర్వహించాల్సి ఉంది. వీటిలో రహదారి మరమ్మతు పనులే అధికంగా ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో 232కి.మీ, ఇల్లందు 212కి.మీ, పెద్దపల్లి 195కి.మీ, మధిర 194.6కి.మీ, సత్తుపల్లిలో 172, పాలేరులో 114, అలంపూర్‌లో 182, మక్తల్‌లో 199కి.మీ, భూపాలపల్లిలో 167, వికారాబాద్‌ 187, చేవెళ్ల 157 కి.మీ చొప్పున ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా ఉన్నా ..కిలోమీటర్లలో హెచ్చుతగ్గులున్నాయి.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 04:19 AM