నిలకడగానే విద్యార్థుల ఆరోగ్యం
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:00 AM
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన హాస్టల్‌లో అస్వ స్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం నిలకడ గానే ఉందని, ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవస రం లేదని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మం గళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యా ర్థినులు తరుణి, రేవతిలను కలిసి మాట్లాడారు.
ఎలాంటి ఆందోళన అవసరం లేదు
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన హాస్టల్‌లో అస్వ స్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం నిలకడ గానే ఉందని, ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవస రం లేదని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మం గళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యా ర్థినులు తరుణి, రేవతిలను కలిసి మాట్లాడారు. టాన్స్‌లైటిట్ జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు కలెక్టర్‌కు తెలిపారు. విద్యార్థినులకు మెరుగైన వై ద్యం అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యం పట్ల ఎ వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కలు షితం ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యా రని ప్రచారం చేయడం సరైంది కాదని, వాస్తవ స మాచారాన్ని చేరవేయాలన్నారు. విద్యార్థినులకు అం దిస్తున్న వైద్య సేవలను ఏటీడీఏ, పాఠశాల ప్రిన్సి పల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అవాస్తవాలను ఎవరైనా ప్రచారం చేస్తే చట్ట పరమై న చర్యలుంటాయన్నారు. ఆయన వెంట డీటీడీవో జనార్ధన్, ఆర్‌ఎంవో శ్రీధర్ ఉన్నారు.
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలె క్టర్ పేర్కొన్నారు. మంగళవారం మాతా శిశు ఆసు పత్రిని పరిశీలించి రోగులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకో వా లని వైద్యులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడు తూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామ న్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్ర రెడ్డి, వైద్యాధికారులు శ్రీమన్నారాయణ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 12:00 AM