ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడలతో మానసికోల్లాసం : ఎమ్మెల్యే వీరేశం

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:08 AM

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద చేస్తాయని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్‌, జూన్‌ 4, (ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద చేస్తాయని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలోని మంగళపల్లి గ్రామ హైస్కూల్‌లో 47వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ బాల బాలికల హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను బుధవారం ప్రారంభించారు. మారుమూల గ్రామమైన మంగళపల్లిలో రాష్ట్రస్థాయి క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామల పవన్‌ కుమార్‌, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ. ఉస్మాన్‌, చింతకాయల పుల్లయ్య, హెచ్‌ఎం కర్రా వీరారెడ్డి, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగులవంచ వెంకటేశ్వర్‌రావు, చింతల ముత్తయ్య, డాక్టర్‌ కృష్ణమాచారి, ప్రకాష్‌రావు, మునీందర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:08 AM