ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:58 AM
మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకాఎల్లమ్మ ఆలయంలో వైశాఖమాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
కనగల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకాఎల్లమ్మ ఆలయంలో వైశాఖమాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుంకుమ అభిషేక పూజలు జరిపించారు. చీరసారె, ఒడిబియ్యం బోననైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయ ముఖ్య అర్చకులు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి మహా మంగళ నీరాజన హారతులిచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది ఆలయ కమిటీ చైర్మన చీదేటి వెంకట్‌రెడ్డి, ఈవో జయరామయ్య ఆధ్వర్యంలో సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.
Updated Date - Apr 30 , 2025 | 12:58 AM