ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శివకేశవులకు విశేష పూజలు

ABN, Publish Date - Jun 10 , 2025 | 12:34 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి.

స్ఫటిక లింగానికి హారతి ఇస్తున్న ప్రధాన పూజారి

యాదగిరిగుట్ట, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపై సోమవారం శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామి, అమ్మవారికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, శ్రీపర్వతవర్ధిని రామలింగే శ్వర స్వామివారి శివాల యంలో స్ఫటిక మూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామి, అమ్మ వార్లను మేల్కొలిపిన అర్చకులు, మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచా మృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండ పంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు విహ్యక్సే నుడికి తొలి పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహిం చారు. సంధ్య వేళ అలంకార వెండీ జోడు సేవలు, సహాస్రనామార్చనలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయం ముఖ మండపంలో స్ఫటిక మూర్తులను అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. శివపార్వతుల ఉత్సమూర్తులకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణా లతో అలంకరించి తిరు వీధుల్లో ఊరేగించారు. ఆలయ ఖజానాకు వివిధ విభా గాల ద్వారా రూ. 30,29,916 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు. కాగా, సుమారు 25వేల మంది దర్శించుకున్నారు. ఎండ వేడిమి లేనందున ఉక్క పోత పూర్తిగా తగ్గింది. ఉభయ దర్శన క్యూలైన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.కొండ పైన బస్టాం డ్‌లో ఆలస్యంగా వస్తున్న బస్సుల కోసం నిరీక్షించిన భక్తులు సీట్ల కోసం ఎగబడ్డారు. కాగా, నమ్మాళ్వారు తిరు నక్షత్రమహోత్సవం ఆలయ పూజారులు వైభవంగా చేపట్టారు. ఆలయంలో ఉదయం స్నపనం సాయంత్ర ఆళ్వారు సేవలను పురవీధుల్లో చేపట్టారు.

గుట్టలో భద్రతా సిబ్బంది ఇబ్బంది

యాదగిరిగుట్ట క్షేత్రంలో ఎండ, వాన, చలి నుంచి రక్షణ లేకుండా విధులు నిర్వహించడం ఆలయ హోంగార్డులు (భద్రత సిబ్బంది)కి కష్టంగా మారింది. కనీస సదుపాయాలు లేకుండా ఔట్‌ పోస్టు ఏర్పాటు చేశారు. మొదటి ఘాట్‌ రోడ్డు వాహనాలు కొండ దిగేందుకు వినియోగిస్తుండగా రెండో ఘాట్‌ రోడ్డు మూసివే శారు. మూడో ఘాట్‌ రోడ్డు వెంట వాహనాలను రూ.500 రుసుంతో అనుమతిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద (నో ఎంట్రీ) భద్రత సిబ్బంది ఎలాంటి రక్షణ లేని చోట విధులు నిర్వహిస్తున్నారు. కనీసం నో ఎంట్రీ బోర్డు కూడా అధికారులు ఏర్పాటు చేయలేకపోతున్నారు. భద్రత సిబ్బందికి ప్రత్యేకంగా షెడ్డు తయారు చేసేందుకు అధికారులు మొదటి ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో నాలుగు పైపులు బిగించి వాటిపై తాత్కాలికంగా రేకుల ఇటీవల వీచిన గాలి, దూమారానికి పైకప్పు ధ్వంసమైంది. తర్వాత ఘాట్‌ రోడ్డుకు ఇరువైపులా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వీటి నీడన తాగునీరు, ఫ్యాన్లు లేక దుమ్ము, ధూళి వస్తున్నందున సిబ్బంది అతి కష్టంతో విధులు నిర్వహిస్తున్నారు. లైట్లు కూడా ఇక్కడ లేవు. విధులు నిర్వహించే సిబ్బందికి మరుగుదొడ్ల సౌకర్యం లేదు. విధులు నిర్వహించే ప్రదేశంలో ఓ వ్యక్తిని నిలిపి తులసీ కాటేజీకి వెళ్తున్నారు. ఈ లోపు ఇక్కడ ఎవరైనా భక్తులు ఈ దారి నుంచి వెళితే సిబ్బందిపై అధికారుల నుంచి చర్యలు తప్పడం లేదు. ఇబ్బందుల దృష్ట్యా మొదటి ఘాట్‌ రోడ్డు ప్రదేశంలో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిబ్బంది వేడుకుంటున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:34 AM