kumaram bheem asifabad- కొందరు అటు.. మరికొందరు ఇటు..
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:22 PM
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో వివాదాస్పదంగా ఉన్న 12 గ్రామాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహ ద్దులో ఉన్న 12 వివాదాస్పద గ్రామాలు తమ పరిధి లోకి వస్తాయని బుధవారం ముంబయిలో నిర్వహిం చిన సమావేశంలో ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే ప్రకటించడం చర్చానీయంశం గా మారింది.
- భూముల పట్టా చుట్టే వ్యవహారం
- సరహద్దు గ్రామాల విలీన అంశంపై భిన్నాభి ప్రాయాలు
ఆసిఫాబాద్/కెరమెరి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో వివాదాస్పదంగా ఉన్న 12 గ్రామాల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహ ద్దులో ఉన్న 12 వివాదాస్పద గ్రామాలు తమ పరిధి లోకి వస్తాయని బుధవారం ముంబయిలో నిర్వహిం చిన సమావేశంలో ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే ప్రకటించడం చర్చానీయంశం గా మారింది. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూము లకు తెలంగాణ ప్రభుత్వం పట్టా ఇవ్వలేదని భూము లను నమ్ముకొని వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న గిరిజనేతరులు వాపోతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిందని, మహరాష్ట్ర రాష్ట్రంలోనే తాము కొనసాగుతామని చెబుతున్నారు. కాగా ఆయా గ్రామాలలోని గిరిజనులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ భూములకు పట్టాలిచ్చి అన్ని సౌకర్యాలు కల్పించిందని తెలియజేస్తున్నారు. తమను తెలంగాణలోనే కొనసా గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొంత మంది మహారాష్ట్ర వైపు మరి కొందరు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టమవుతోంది.
- వివాదాస్పద గ్రామాల్లో..
సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాల ఆంశం భూ ముల పట్టాల చుట్టే తిరుగుతోంది. కెరమెరి మండలం లోని పరందోళి, అంతాపూర్, ఏసాపూర్, కోటా, పరస్‌వాడ, బొలాపటార్, పద్మావతి, ఇందిరనగర్, మహారాజ్‌గూడ, ముఖద్దంగూడ, లెండిజాల, గౌరి 12 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారుగా ఆరు వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ఎస్సీ, బీసీ, మైనార్టీలు సుమారు నాలుగు వేల మంది ఉన్నారు. గిరిజనులు సుమారు రెండు వేల మంది ఉన్నారు. తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. పంచాయతీ నుంచి మొదలు ఎంపీ ఎన్నికల వరకు ఆ గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. తెలంగాణతో పోలిస్తే సంక్షేమ పథకాల అమలు విషయంలో మహారాష్ట్ర కొంత వెనుకబడి ఉందని చెబుతున్నారు. ఈ గ్రామాలలోని గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు తెలంగాణ ప్రభుత్వం అటవీహక్కు పత్రాలు అందించింది. ఇదే క్రమంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న గిరిజనే తర(ఎస్సీ, బీసీ, మైనార్టీల ు)లకు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వలేదు. దీంతో వీరు రుణాలు, రుణమాఫీ తదితర పథకాలను పొంద లేక పోతున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం వివాదాస్పద గ్రామాలలోని అటవీ, రెవెన్యూ భూముల్లో సర్వే నిర్వహించి హద్దులను ఏర్పాటు చేసింది. సాగులో ఉన్న గిరిజనేతురులు మహరాష ్ట్రలోని రాజూరా ఎమ్మెల్యే దేవ్‌రావు బోంగ్డేదృష్టికి తీసు కువెళ్లారు. దీంతో అయన ఈ సమస్యను ముఖ్యమ త్రి దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం ముంబయిలోని విదాన భవన్‌లో ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి చంద్రశేఖర్ భవన్కులే అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజూర ఎమ్మెల్యే, చంద్రపూర్ కలెక్టర్, 12 గ్రామాలకు చెందిన కొందర ప్రజలు హాజరయ్యారు. ఈ గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కరించేందుకు ఆ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకే వస్తాయని కీలక ప్రకటన చేశారు. కానీ ఈ వివాదాస్పద గ్రామాల ఆంశం సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
మహారాష్ట్రలోనే ఉంటాం..
- కాంబ్లే లక్ష్మణ్, మాజీ సర్పంచ్, పరందోళి
మేము మహారాష్ట్రలోనే ఉంటాం. మాకు మహారాష్ట్ర ప్రభుత్వం పట్టాలిస్తామని హామీ ఇచ్చింది. గిరిజనేత రులు సాగు చేసుకుంటున్న భూములకు తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు. దీంతో మాకు పంట రుణాలు, రైతుభరోసా, రుణమాఫీ వర్తించడంలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చింది. అందువల్ల మహారాష్ట్రలోనే కొనసాగుతాం.
తెలంగాణలోనే కొనసాగుతాం:
- నితీన్ రాథోడ్, పరందోళి తండా
తెలంగాణ ప్రభుత్వం మేము సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది. దీంతో రైతుభరోసా, పంట రుణమాఫీ తదితర పథకాలు పొందుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము తెలంగాణలోనే కొనసాగుతాం. మా గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
Updated Date - Jul 18 , 2025 | 11:22 PM