ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూభారతి ద్వారానే సమస్యల పరిష్కారం

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:24 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్‌వో ఆర్‌ చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతులు తెలుసు కోవాలని తద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

మంచిర్యాలలో భూభారతి సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్‌వో ఆర్‌ చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతులు తెలుసు కోవాలని తద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్‌హాల్‌ (షాదీఖాన)లో బుధవారం భూ భారతి నూ తన ఆర్‌వోఆర్‌ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన చ ట్టం ద్వారా రైతులకు భూమి హక్కు రికార్డుల్లో తప్పుల సవరణ అవకాశం కల్పించామన్నారు. రిజిస్ర్టేషన్‌, మ్యుటేష న్‌ చేసే ముందు భూముల పూర్తి వివరాలతో సర్వే చేసి మ్యాప్‌ తయారు చేస్తారన్నారు. వారసత్వంగా వచ్చిన భూ ములకు విరాసత్‌ చేసే ముందు సమగ్ర విచారణ జరిపి పట్టా చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ద రఖాస్తులు స్వీకరించడం గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. రైతులకు భూమిపట్టా, లావన్‌ పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్య లను ప్రభుత్వ ఆదేశాలు, చట్టప్రకారం చర్యలు తీసుకుం టామన్నారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు అనిత, తహసీల్దార్‌ రఫతుల్లా, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:24 PM