భూభారతితో భూ సమస్యల పరిష్కారం
ABN, Publish Date - Apr 22 , 2025 | 11:36 PM
ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంతో భూ సమస్యలకు పరి ష్కారం దొరుకు తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి అవగా హన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కోటపల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన భూ భారతి నూతన ఆర్‌వోఆర్ చట్టంతో భూ సమస్యలకు పరి ష్కారం దొరుకు తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి అవగా హన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి నూత న చట్టం ద్వారా రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని, రిజి ష్ర్టేషన్, మ్యుటేషన్ చేసేందుకు భూముల వివరాలను పూర్తిస్ధాయిలో స ర్వే చేస్తారన్నారు. సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించడంతో పా టు నిర్ణీత కాలంలో భూముల విరాసత్ చేసే అవకాశం కలుగుతుంద న్నారు. పాసు పుస్తకాల్లో భూమి పటం, రెండెంచల అప్పీలు వ్యవస్ధ ఏర్పా టుతో పాటు బూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు ఆబాది, వ్యవసా యేతర భూములకు హక్కుల రికార్డు, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు ఎవరైనా పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అం శాలను ఈ చట్టంలో పొందుపర్చారన్నారు. ఈ కార్యక్రమంలో జాయిం ట్ కలెక్టర్ మోతిలాల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, ఆర్డీవో శ్రీని వాసరావు, తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో లక్ష్మయ్య, డిప్యూటి తహసీల్దార్ నవీన్, రైతులు , పార్టీల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 11:36 PM