సమాజానికి కమ్యూనిస్టులు ఎంతో అవసరం
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:44 PM
సమా జానికి కమ్యూనిస్టుల అవసరాలు ఎంతగానో ఉందని, ఎర్ర జెండా పార్టీలన్ని ఏకమై కేంద్రంలో ఉన్న బీజేపీ ఫాసిస్టు విధానాన్ని తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ఆదివారం జిల్లా కేంద్రంలో ఎంకన్వెన్ష న్‌హాల్(గుండా మల్లేశ్ స్మారకహాల్)లో సీపీఐ 4వ జిల్లా మహాసభలకు చివరి రోజున ఆయన పాల్గొని ప్ర సంగించారు.
ఎర్ర జెండాపార్టీలన్నీ ఏకం కావాలి
సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
మంచిర్యాలకలెక్టరేట్, జూన్22 (ఆంధ్రజ్యోతి): సమా జానికి కమ్యూనిస్టుల అవసరాలు ఎంతగానో ఉందని, ఎర్ర జెండా పార్టీలన్ని ఏకమై కేంద్రంలో ఉన్న బీజేపీ ఫాసిస్టు విధానాన్ని తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ఆదివారం జిల్లా కేంద్రంలో ఎంకన్వెన్ష న్‌హాల్(గుండా మల్లేశ్ స్మారకహాల్)లో సీపీఐ 4వ జిల్లా మహాసభలకు చివరి రోజున ఆయన పాల్గొని ప్ర సంగించారు. ఇంతకుముందు ఆ పార్టీ నాయకులు చి ప్ప నర్సయ్య అరుణాపతాకాన్ని ఆవిష్కరించి అమర వీ రుల స్థూపానికి ఇటీవల అమరులైన మావోయిస్టు నా యకులు నంబాల కేశవరావు, గాదర్ల రవి, సీనియర్ పాత్రికేయులు మునీర్‌లకు నివాళులు అర్పించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులపై బీజే పీ నిరంకుశ పాలనను సాగిస్తుందని బూర్జువా పార్టీ న్నీ కలిసి కమ్యూనిస్టులను అంతం చేయాలనే పగటి కలలు కంటుందని అవి ఎన్నటికి నేరవేరవన్నారు. మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం అపరేషన్ కగార్ చేపట్టి బూటకపు ఎన్‌కౌం టర్‌లు చేయడం మానుకోవాలన్నారు. ప్రాణహిత ప్రా జెక్టును తక్షణమే ప్రారంభించి రాష్ట్ర ప్రయోజనాలు చే కూరుతాయని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తుమ్మి డిహెట్టి చేపట్టక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిరుప యోగంగా మారిందన్నారు కాళేశ్వరం, బనకచర్ల రెండు ప్రాజెక్టులపై విచారణ వివాదాలను నెలకొనడంతో తక్ష ణమే అఖిలపక్షాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డి మాండ్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వాటి ఉనికిపై అనేక సందేహాలు నెలకొన్నాయన్నారు. జల నిపుణులతో సమావేశం నిర్వహించి తక్షణమే కమిటీ వేయాలన్నారు. బనకచర్ల గోదావరి వరద నీరు 3వేల టీఎంసీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం వాడుకోవడం లే దనే కారణంతో ఏపీ సీఎం చంద్రబాబు నా యుడు చెప్పి చేతులు దులుపకోవడం సరికాదన్నారు. సింగరే ణి ప్రాంతంలో అనేక సమస్యలు పేరుకపోయి ఉన్నా యన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గౌరవ వేతనం పెంచిసుప్రీం కోర్టు సూచనలు పాటిం చాల న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్, ఏఐటీయుసీ రాష్ట్ర అధ్య క్షు లు వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జిల్లా నాయకులు మేకల దాసు, రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి పౌలు, కలీందర్ అలీఖాన్, లింగం రవి, మిరియాల రాజేశ్వర్ రావు, భీమనాథుని సుదర్శన్, దాగాం మల్లేశ్, ఇప్పకా యల లింగయ్య, మల్లయ్య, పూర్ణిమ పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:44 PM