ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మురిపించి..ముఖం చాటేసి

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:02 AM

మే నె లలో మురిపించిన వర్షాలు జూన్‌లో ముఖం చాటేశా యి. వానాకాలం ప్రారంభమై 20 రోజులు దాటినా చి నుకు జాడ లేదు. జూన్‌లో నైరుతి రుతుపవనాల ప్ర భావంతో భారీ వర్షాలు కురవాల్సి ఉండగా, జిల్లాలో 77 శాతం లోటువర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి 21 వరకు 111.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కా గా ఇప్పటికీ 34.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది.

వర్షం కోసం రైతుల నిరీక్షణ

గందరగోళంగా వాతావరణ పరిస్థితులు

ఎండాకాలంలో వర్షాలు..వానాకాలంలో ఎండలు

జూన్‌లో 77 శాతం లోటు వర్షపాతం నమోదు

-15 మండలాల్లో తీవ్ర వర్షాభావం

-మొలకెత్తని పత్తి విత్తులు

-ఆందోళనలో రైతులు

===================

నెన్నెల/కాసిపేట జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : మే నె లలో మురిపించిన వర్షాలు జూన్‌లో ముఖం చాటేశా యి. వానాకాలం ప్రారంభమై 20 రోజులు దాటినా చి నుకు జాడ లేదు. జూన్‌లో నైరుతి రుతుపవనాల ప్ర భావంతో భారీ వర్షాలు కురవాల్సి ఉండగా, జిల్లాలో 77 శాతం లోటువర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి 21 వరకు 111.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కా గా ఇప్పటికీ 34.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలోని 15 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. ముందస్తువర్షాలు చూసి పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో దాదాపు గా 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు వేసుకు న్నారు. మొలకలు రాక వారంతా తీవ్ర ఆందోళన చెం దుతున్నారు. మరో రెండుమూడు రోజుల్లో వర్షం రాక పోతే విత్తులన్ని నేలలోనే పాడైపోతాయని ఆందోళన చెందుతున్నారు. వరుణదేవుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వానలు కురియాలని కప్ప తల్లి ఆడుతూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

-1.58 లక్షల ఎకరాల్లో పత్తిసాగు

జిల్లాలో 1.58,753 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అ ధికారులు అంచనాలు రూపొందించారు. దాదాపు రై తులందరూ వర్షాధారంగానే పత్తి సాగు చేస్తారు. తొ లకరి వర్షాలకే విత్తనాలు వేసుకుంటే పంట మంచిగా ఎదిగి ఆశించిన దిగుబడి వస్తుంది. మేలోనే చేలన్నీ లో తుదుక్కులు వేసుకొని సిద్ధం చేసుకున్నారు. పొడి చేల ల్లోనే రోటవేటర్‌, కల్టివేటర్‌తో చదును చేసి విత్తనాలు వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 70 శా తం రైతులు పత్తి విత్తుకున్నారు. తడిపొడి దుక్కిలో ప డిన విత్తులు మొలకవచ్చి పదను లేక మాడి పోతు న్నాయని రైతులు పేర్కొన్నారు.

-15 మండలాల్లో తీవ్ర వర్షభావం

ఈ ఏడు వాతావరణ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఎండలు దంచి కొట్టాల్సిన రోహిణి కార్తె (మే నెల)లో అకాల వర్షాలు కురిశాయి. రోజుల తరబడి మ బ్బులు కమ్ముకొని ఉన్నాయి. జిల్లాలో మే నెలలో భారి వర్షాలు కురిసి, 149 మిల్లీ మీటర్ల వర్షపాతం నమో దైంది. ఎన్నడూ లేని విధంగా ఈ యేడు నైరుతి రుతు పవనాలు మే చివరి వారంలోనే ప్రవేశించడంతో వ ర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశపడి సాగు పనులు ప్రారంభించారు. మృగశిరలో దంచి కొట్టాల్సిన వర్షాలు కార్తె ముంగింపునకు వచ్చి ఆరుద్ర ప్రారంభమవుతున్న వేళ కూడా వానల జాడ లేదు. జూన్‌ 21 వరకు సాధా రణ వర్షపాతం 111.7 మిల్లీమీటర్లు కాగా 77 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి 21 వర కు 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. జిల్లాలో ప్రస్తుతం 32 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. జన్నారం, దండెపల్లి, కాసిపేట మండలాలు తప్ప మిగతా 15 మండలాల్లో తీవ్ర వర్ష భావ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు మబ్బు లు కమ్ముకొని గాలులు వీస్తున్నప్పటికీ వర్షం మాత్రం రావడం లేదు. ఈ నెల 25 వరకు జిల్లాలో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేం ద్రం తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వాతావరణ ని పుణులు వర్షాలు కురుస్తాయిని చెబుతున్నప్పటికీ వాన జాడ మాత్రం కానరావడం లేదు.

-సాగు సీజన్‌పై ఎఫెక్ట్‌

వర్షాభావ పరిస్థితులు సాగు సీజన్లపై తీవ్ర ప్రభా వాన్ని చూపుతాయి. జిల్లాలో పత్తి, వరి ప్రధాన పంట లు కాగా తొందరగా పత్తి విత్తే పనులు ముగించుకొని వరి సాగువైపు రైతులు వెళ్లారు. వర్షాలు లేక పనులు వెనుకపడుతున్నాయి. జూన్‌ ఆఖరు వరకు పత్తి విత్త నాలు వేయడం పూర్తి చేసుకొని, వడ్లు అలుకు తారు. ఆగస్టు 20 వరకు నాట్లు పూర్తి చేసుకుంటే పొలాలు ముందుగా కోతకు వస్తాయి. దీంతో యాసంగి సాగు సులభం అవుతుంది. పత్తి విత్తడం ఆలస్యం కావడంతో పత్తిలో కలుపు తీతలు, వరి నాట్లు ఏక కాలంలో వస్తే కూలీల కొరతతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతు లు అంటున్నారు. ఈ పాటికే వరి పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకొని మరో వైపు నారుమడులు తయా రు చేసుకోవాల్సి ఉంది. ఇంకా పొలాల్లో దుక్కులే ప్రా రంభించలేదని రైతులు తెలిపారు.

వర్షం లేక పత్తి విత్తనాలు మొలకెత్తలేదు

-కొండపల్లి శరత్‌, పత్తి రైతు, నందులపల్లి, నెన్నెల మండలం

ముందుగా కురిసిన వర్షాలకు జూన్‌ రెండో వారం లోనే 18 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. అప్పటి నుంచి వర్షం లేదు. నాలుగైదు రోజుల్లో మొలక రావా ల్సి ఉండగా ఇప్పటి వరకు మొలకలు కనిపించడం లే దు. పదను ఉన్న చోట పడిన కొన్ని విత్తులు మొల కెత్తినప్పటికీ ఎండ వేడికి వడలిపోతున్నాయి. భూమిలో పదును లేక నేలలోనే విత్తనాలన్ని వట్టిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు వర్షాలు వచ్చినప్పటికి 30 శాతం విత్తు లు మరోసారి వేసుకోవాల్సి వస్తుంది. ఈ ఏడు సీజన్‌ ప్రారంభంలోనే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.

రైతులు తొందరపడొద్దు

-కోట శివకృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, బెల్లంపల్లి

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ప్ర స్తుత పరిస్థితుల్లో రైతులు తొందరపడి విత్తనాలు వే సుకోవద్దు. జూలై 15 వరకు విత్తనాలు వేసుకునే సమ యం ఉంది. భూమిలో కనీసం తేమ కూడా లేకముందే విత్తుకుంటే మొలకలురావు. తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీ మీటర్లు, బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తరువాతనే వి త్తనాలు వేసుకోవాలి. కనీసం 20 సెంటీమీటర్ల లోతు వరకు భూమి తడిసిన తరువాతనే పత్తి, జొన్న, కంది, పెసర పంటలు విత్తుకోవాలి. తడిపొడి నేలల్లో విత్తనా లు వేసుకుంటే భూమి లోపలి నుంచి వచ్చే వేడికి మొలకశాతం తగ్గుతుంది.

నకిలీ విత్తనాలను కట్టడి చేశాం...

జిల్లా వ్యవసాయాధికారి కల్పన

జిల్లాలో నకిలీ విత్తన విక్రయాలను పూర్తిగా కట్టడి చేశాం. రైతులు విత్తనాలను డీలర్ల వద్దనే కొనుగోలు చే సి ఆ రషీదులను భద్రపరుచుకోవాలి. అతివృష్టి అనా వృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ప్రభుత్వం నష్టపరిహా రం ఇస్తుంది. కాబట్టి రైతులు రసీదులను భద్రపరుచు కోవాలి. జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపోయేంత ఎరు వులు విత్తనాలను అందుబాటులో ఉంచాం. దీనిపై ఎ వరు ఆందోళన చెందవద్దు. రైతులు రసాయనిక ఎరు వుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. దీని వల్ల భూమి సారవంతమైన భూములు ఉండాలంటే సేంద్రీ య వ్యవసాయ పదతులను రైతులు అలవర్చుకోవాలి.

Updated Date - Jun 22 , 2025 | 12:02 AM