చదువుతో పాటు నైపుణ్యం అవసరం
ABN, Publish Date - May 17 , 2025 | 10:54 PM
విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యంపై కూడ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేజీబీవీ సెక్టోరల్ ఆఫీసర్ యశోధర అన్నారు. నస్పూర్ కస్తూర్భా గాంధీ విద్యాలయంలో శ నివారం కేజీబీవీ జిల్లా సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం నిర్వహిం చారు.
కేజీబీవీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో
సెక్టోరల్ ఆఫీసర్ యశోధర
నస్పూర్, మే 17 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యంపై కూడ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేజీబీవీ సెక్టోరల్ ఆఫీసర్ యశోధర అన్నారు. నస్పూర్ కస్తూర్భా గాంధీ విద్యాలయంలో శ నివారం కేజీబీవీ జిల్లా సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు వివిధ నృత్య ప్రదర్శనలు నిర్వహించి చూపరులను ఆకట్టుకున్నాయి. జిల్లాలోని 18 కేజీబీవీల నుంచి 170 మంది విద్యార్థినులు వివిధ అంశాలపై సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనగా వారికి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీషు, స్పీడ్ మాథ్స్, పెయింటింగ్, సంగీతం, యోగా అంశాల తో పాటు శాస్ర్తీయ, జానపద, నృత్యాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన పెంయింటింగ్స్‌ను ప్రదర్శించారు. సం గీతంలో 16 సరళీ, స్వరాలు, అన్నమయ్య కీర్తనలు, దేశభక్తి గీతాలను వి ద్యార్థులు ఆలపించారు. సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్‌లను అందజేశారు. చదువులో మెలకువలతో పాటు వివిధ అం శాలపై నైపుణ్యం ఎంతో అవసరమని యశోధర అన్నారు. ఈ కార్యక్రమం లో కోర్సు డైరెక్టర్, కేజీబీవీ ప్రిన్సిపాల్ మౌనికతో పాటు బండ శాంకరి, స్వర్ణలత, దివ్య, హేమలత, తిరుపతి, రజిత, భవాని రోజా, శారద, కవిత, రోహినిలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 10:54 PM