రహదారిపై నీడ
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:54 AM
ఈ వేసవిలో రోడ్లపై ప్రయాణిం చే వాహనాదారులకు సిగ్నల్ పాయింట్ల నీడ కల్పించేందుకు మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి సంకల్పించారు.
రహదారిపై నీడ
నీలగిరిలో సిగ్నల్ పాయింట్స్ వద్ద చలువ పందిళ్లు
కాసేపు ఉపశమనం పొందుతున్న వాహనాదారులు
అన్ని సిగ్నల్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయాలి
రామగిరి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఈ వేసవిలో రోడ్లపై ప్రయాణిం చే వాహనాదారులకు సిగ్నల్ పాయింట్ల నీడ కల్పించేందుకు మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా న ల్లగొండ పట్టణంలోని సిగ్నల్ పాయింట్ల వద్ద తాత్కాలిక గ్రీనషీట్ ఏర్పా టు చేసేందుకుమంత్రి ప్రతిభ పూనారు. మంత్రి ఆదేశాల మేరకు ము నిసిపల్ యంత్రాంగం పనులు ప్రారంభించారు. పట్టణంలో క్లాక్‌టవర్ సెంటర్, భాస్కర్ టాకీస్ సెంటర్, బస్టాండ్ ఏరియా, ఎనజీ కాలేజీ, సా గర్ రోడ్డు వంటి పాంత్రాల్లో 5సిగ్నల్స్ పాయింట్ల ఉన్నాయి. అయితే మండుటెండల్లో వాహనాలపై వచ్చి సిగ్నల్స్ వద్ద 30 సెకన్ల పాటు వా హనాలు ఆగుతుండటంతో ఆయా వాహనాదారులు ఎండ వేడిమి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మరికొంత మంది వ డదెబ్బకు గురవుతున్న ప్రమాదాన్ని పసిగట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టణంలో సిగ్నల్స్ వద్ద తాత్కాలిక చలువ పందిళ్లు (గ్రీన మ్యాట్) వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎనజీ కాలేజీ సెంటర్
మునిసిపల్ మాజీ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, మునిసిపల్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎనజీ కాలేజీ వద్ద తాత్కాలిక చలువ పందిళ్లు వేయించారు. ఈ రెండు మూడు రో జుల్లో ఇదే సెంటర్లో మరో తాత్కాలిక చలువ పందిళ్లు వేయనున్నారు. ఈ సెంటర్లో వేసిన పందిళ్లతో టూ-వీలర్, భారీ వాహనాలకు ఎలాంటి ఎదురుకాకపోతే మిగిలిన సెంటర్లో కూడా ఈ చలువ పందిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పందిరికి రూ.5 లక్షలు చొప్పున ఖర్చు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయనా కూడా వాహనాదారులకు ఎ లాంటి ఇబ్బందులు ఎదురుకాకపోతే మిగిలిన సెంటర్లో కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మునిసిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలి
వాహనదారులకు కాసేపు నీడ కల్పించాలన్న ఉద్దేశంతో గ్రీన మ్యాట్ ఏర్పాటు చేయడం అభినందనీయం. కానీ గాలి వచ్చిన సమయాల్లో ఈ మ్యాట్ ఎగిరి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగిలిన సెంటర్లో ఏర్పాటు చేస్తే బాగా ఉంటుంది.
- జల్లెల ప్రవీణ్‌కుమార్, చెర్వుగట్టు
నీడ కల్పించడం అభినందనీయం
వేసవిలో రోడ్లపై ప్ర యాణించే వాహనదారుల కు కాసేపైన నీడ కల్పించాలన్న ఉద్దేశ్యంతో సిగ్న ల్స్ పాయింట్ల వద్ద గ్రీన మ్యాట్ ఏర్పాటు చేయడం అభినందనీయం. గతంలో ఇలాంటి మంచి పనులు ఏ నాయకులు, అధికారులు చేయలేదు. ప్రతిపక్షాలకు కామెంట్ చేయడం తప్ప మంచి పనులు చేయడం తెలియదు.
- ముజ్జు, నల్లగొండ
అన్ని సిగ్నల్స్ వద్ద ఏర్పాటుకు కృషి
ఫైలట్ ప్రాజెక్టు కింద ఎనజీ కళాశాల వద్ద తా త్కాలిక చలువ పందిరి ఏ ర్పాటు చేశాం. దీని ఖర్చు రూ. 3 లక్షలకు పైగానే వ స్తుంది. ఇక్కడ ఎలాంటి ఇ బ్బందులు ఎదురుకాకపో తే పట్టణంలోని మిగిలిన సెంటర్లో కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
- ముసాబ్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్
Updated Date - Apr 25 , 2025 | 12:54 AM