ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌కు సెమీ డీలక్స్‌ సర్వీసు లేవీ!

ABN, Publish Date - May 30 , 2025 | 12:46 AM

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించిన తర్వాత తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ కనపడుతోంది.

నార్కట్‌పల్లిలో ప్రయాణికుల రద్దీ

హైదరాబాద్‌కు సెమీ డీలక్స్‌ సర్వీసు లేవీ!

అయితే ఎక్స్‌ప్రెస్‌... లేదంటే పల్లెవెలుగులేనా

రద్దీతో రోజూ నిలబడే వెళ్తున్నామంటున్న ప్రయాణికులు

నార్కట్‌పల్లి బస్టేషన నుంచి లేని సెమీ డీలక్స్‌

సర్వీసుల సంఖ్యను పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి

నార్కట్‌పల్లి, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించిన తర్వాత తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ కనపడుతోంది. ఆర్టీసీ చరిత్రలోనే రికార్డులు బ్రేక్‌ అయ్యే లా ఓర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) నమోదైన తీరు ఇందుకు నిదర్శనం. సీటింగ్‌ సామర్థ్యం 55కి మించి అదనంగా మరో 35 నుంచి 40 మందితో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి నడుస్తున్నాయి. కానీ బస్సుల్లో మహిళల ఆక్యుపెన్సీ రేషియోనే 80 శాతం వరకు ఉంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఉచిత ప్రయాణ సౌక ర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో ఏ ఒక్కటీ ఖాళీగా వెళ్తున్న దాఖలాలు కనబడటం లేదు. ఓఆర్‌కు తగినట్లుగా బస్సుల సంఖ్య లేకపోవడంతో కిక్కిరిసి పోక తప్పని పరిస్థితి. అయితే ఈ ప్రభావం కొందరు రోజూ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులపై తీవ్రంగా పడుతోంది. తాము ప్రయాణ చార్జీలు చెల్లించి ప్రతీరోజూ నిలబడి పోవాల్సి వస్తోందని పలువు రు ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.

ఆధార్‌ చెల్లకుండా...

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌక ర్యం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో అమాం తం పెరిగిన రద్దీ పరిస్థితులను స్వయంగా చూ సిన ఆర్‌టీసీ అధికారులు సెమీ డీలక్స్‌ బస్సుల ను కొన్ని ప్రాంతాలకు నడుపుతున్నారు. లిమిటెడ్‌ స్టాపుల్లోనే నిలిపేలా ఈ సర్వీసులను ప్రవేశపెట్టారు. బస్సు చార్జీలు చెల్లించైనా ప్రయాణిం చే వారిని దృష్టిలో పెట్టుకుని వారి సౌలభ్యం కోసమే ఈ సెమీ డీలక్స్‌ సర్వీసులను ఆర్టీసీ అధికారులు తీసుకువచ్చారు. ఎక్స్‌ప్రె్‌సకు ఎక్కు వ డీలక్స్‌కు తక్కువగా ఉండే ఈ బస్సుల్లో ఆధా ర్‌ కార్డును ఉపయోగించి ఉచిత ప్రయాణం చేయడం కుదరదు.

సెమీ డీలక్స్‌ సర్వీసులు లేవు

నార్కట్‌పల్లి బస్టేషన నుంచి సెమీ డీలక్స్‌ సర్వీసుల సౌకర్యం హైద్రాబాద్‌ వైపునకు లేకపోవడం గమనార్హం. బస్‌స్టేషన పరిధిలో కామినేని మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి, ఎంజీ యూనివర్సిటీ, చెర్వుగట్టు ప్రధాన దేవాలయం నార్కట్‌పల్లి బస్‌స్టేషన పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్‌కు వెళ్లే భక్తులు, ఉద్యోగుల రాకపోకలు ఈ బస్‌స్టేషన నుంచే చేయాల్సి ఉంది. కానీ అయితే ఎక్స్‌ప్రెస్‌ లేదా పల్లె వెలుగుబస్సులు మాత్రమే ఉన్నాయి. ఈ బస్సుల్లో రద్దీతో కొందరు ప్రతీ రోజూ హైదరాబాద్‌కు ప్రయాణించే వారు బస్సుల్లో సీటు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. పోనీ చార్జీలు చెల్లించైనా కూర్చొని వెళదామనుకుంటే సెమీ డీలక్స్‌ బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ కేవలం సూర్యాపేట డిపోకు చెందిన 3 సర్వీసులు మాత్రమే అదీ గడిచిన మూడు రోజులుగా నడుపుతున్నారు.

నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు 250 ట్రిప్పులు

నార్కట్‌పల్లి బస్‌స్టేషన నుంచి హైదరాబాద్‌కు ఆయా డిపోల బస్సులు సుమారు 250 ట్రిప్పుల వరకు నడుస్తున్నాయి. ఖమ్మం రీజియన పరిధిలోని ఖమ్మం, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు డిపోలకు చెందిన వాటితో పాటు నల్లగొండ రీజియన పరిధిలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, నార్కట్‌పల్లి డిపోలకు చెందిన బస్సులు హైదరాబాద్‌ సెక్టార్‌లో నడుస్తున్నాయి. సుమారు 250 ట్రిప్పుల్లో కలిసి దాదాపుగా 14,000లకు పైగా ప్రయాణికులను హైదరాబాద్‌ వైపునకు చేరవేస్తున్నాయి.

సెమీ డీలక్స్‌ సర్వీసుల సంఖ్య పెంచాలి

హైదరాబాద్‌కు వెళ్లేందుకు నార్కట్‌పల్లి బస్‌స్టేషన కూడలి లాంటి ది.జిల్లా కేంద్రంతో పా టు పర్యాటక ప్రాంతా లు, విద్య, ఆరోగ్య, వ్యాపా ర, వాణిజ్య అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌ కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సం ఖ్య ఈ బస్‌స్టేషన నుంచి ఎక్కువగానే ఉం టుంది. ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణ సౌకర్యంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోనీ చార్జీలు చెల్లించి ప్ర యాణించాలనుకుంటే సెమీ డీలక్స్‌ సర్వీసు లు ఎక్కువగా లేవు. ఆర్టీసీ అధికారులు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని నార్కట్‌పల్లి బస్‌స్టేషన మీదుగా హైదరాబాద్‌కు నడిచే సెమీ డీలక్స్‌ సర్వీసుల సంఖ్యను పెంచాలి.

- కందగట్ల శ్రీనివాస్‌, నార్కట్‌పల్లి

సెమీ డీలక్స్‌ బస్సులు ఎక్కువగా లేవు

నల్లగొండ రీజియన పరిధిలో సెమీ డీలక్స్‌ బస్సులు ఎక్కువగా లే వు. వాటి తయారీ సం ఖ్య ఎక్కువగా లేదు. ఉన్న కొన్ని సర్వీసులను హై దరాబాద్‌ రూట్‌లోనే సూర్యాపేట డిపో నుం చి ఆపరేట్‌ చేస్తున్నాం. ప్రయాణికులు కోరితే డీలక్స్‌ బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తాం.

- జానరెడ్డి, ఆర్‌ఎం, నల్లగొండ

Updated Date - May 30 , 2025 | 12:46 AM