Seethakka: ఇళ్ల పేరిట ఇసుకను అమ్ముకున్నారు : సీతక్క
ABN, Publish Date - Jun 14 , 2025 | 03:26 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని, ఇళ్ల పేరుతో ఇసుకను అమ్ముకున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు.
కొత్తగూడ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని, ఇళ్ల పేరుతో ఇసుకను అమ్ముకున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి సంవత్సరానికి వేయి ఇళ్లు నిర్మించి ఇచ్చినా పదేళ్లలో పేదలకు 10 వేల ఇళ్లు ఉండేవన్నారు.
నేడు వేలాదిగా ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. కాగా, రం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని మంత్రి సీతక్క అన్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని మంత్రి కార్యాయం ఒక ప్రకటనలో తెలిపింది. సీతక్క అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, వారం పది రోజుల్లో పంచాయతీ ఎన్నికలపై ఒక స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పారని అందులో పేర్కొన్నారు.
Updated Date - Jun 14 , 2025 | 03:26 AM