ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad-పాఠశాలలను సందర్శించాలి

ABN, Publish Date - Jul 23 , 2025 | 11:08 PM

అధికారులు తమ పరిధిలో ప్రతి రోజు ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పర్కిరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసితో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవో, ఎంపీవోలు, కార్యదర్శులుతో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): అధికారులు తమ పరిధిలో ప్రతి రోజు ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పర్కిరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసితో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవో, ఎంపీవోలు, కార్యదర్శులుతో సమావేశం నిర్వహించారు. వసతి గృహాల సందర్శన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం, వన మహోత్సవం, ప్రధాన మంత్రి అవాస్‌ యోజన గ్రామీణ్‌ పథకం కింద ఇండ్ల లబ్ధిదారుల ధ్రువపత్రాల సర్వే, ప్రధాన మంత్రిజన్‌మన్‌ పథకం, పీవీటీజీలకు ఇళ్ల మంజూరు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్‌ మాట్లాడుతూ మండలాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థలకు అధికారులు తమకు కేటాయిం చిన పాఠశాలల్లో ప్రతి రోజు ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పర్కిరించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు. నాణ్యమైన విద్య అందించే విధంగా ఉపాధ్యాయుల సమన్వ యంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, డీఎల్‌పీవో ఉమర్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ఆసిఫాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్‌ మండలం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులు, రిజిస్టర్లు, మందుల నిలువలను పరిశీలించి రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రిలో వార్డులు, పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలన్నారు. అవసరమైన మందుల నిలువలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్య సిబ్బంది విధులలో సమయ పాలన పాటించాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కాకూడదని తెలిపారు. గర్భిణీలను ప్రసవం కొరకు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించానలి, ఔషదాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో సీతారాం, వైద్య సిబ్బంది ఉన్నారు.

ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు

కెరమెరి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని హకా రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులంకు అందాల్సిన ఎరువులను అధిక ధరలకు విక్రయించి ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే ఆ షాపు నిర్వహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం షాపు స్టాక్‌ రిజిస్టర్‌, గోదాంలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని బీసీ బాలురు హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ పాటించాలన్నారు. హస్టల్‌లోని స్టోర్‌ రూం పరిశీలించారు. వర్షాకాలంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హస్టల్‌ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు కార్పెట్స్‌ అందజేశారు. ఆయన వెంట ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్‌ భూమేశ్వర్‌, ప్రత్యేకాధికారి వెంకట్‌, ఏఓ యుగేందర్‌, వార్డెన్‌ ప్రేందాస్‌ ఉన్నారు

Updated Date - Jul 23 , 2025 | 11:08 PM