ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బడి.. సమస్యల ఒడి

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:49 AM

ప్రభుత్వ పా ఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్ర యత్నాలు చేస్తుంది.

ఇండ్లూరు పాఠశాలలో అసంపూర్తిగా భవనం

బడి.. సమస్యల ఒడి

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువు

అసంపూర్తిగా పనులు

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం

పట్టించుకోని అధికారులు

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

తిప్పర్తి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పా ఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్ర యత్నాలు చేస్తుంది. ప్రభుత్వ బడిలో సౌకర్యా లు లేకనే విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వాలు గతంలో మన ఊరు మనబడి, ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల అనే కార్యక్రమాలతో ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయిస్తున్నా రు. అయినా కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తయినా మరికొన్నింటిలో మాత్రం అంసంపూర్తిగా నే పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, మూత్రశాలలు, విద్యుత సౌకర్యం, విద్యార్థులకు సరిపడా డెస్క్‌ సౌకర్యాలతో ఉన్న బెంచీలు ఏర్పాటు చేసేలా సంబంధిత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు.

అసంపూర్తిగానే పనులు

తిప్పర్తి మండల వ్యాప్తంగా మొత్తం 46 పాఠశాలలు ఉండగా అందులో మన ఊరు మనబ డి కార్యక్రమంలో 15పాఠశాలలు ఎంపికయ్యా యి. అందులో 4పాఠశాలల్లో మాత్రమే పూర్తిస్థాయిలో పనులు పూర్తయ్యాయి. మిగతా ఉన్న 11 పాఠశాలల్లో మాత్రం పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అమ్మ ఆదర్శపాఠశాల కార్యక్రమంలో 27 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో కూడా కనీస వసతులు పూర్తి కాకుండా సుమారు 10 పాఠశాలలకు పైనే ఉన్నాయి. ఇవి పరిశీలించాల్సిన అ ధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు అసంపూర్తిగా ఉండడానికి గల కారణాలు మాత్రం కాంట్రాక్టర్ల కు రావాల్సిన బిల్లులు రాకపోవడమేనని పలు పాఠశాలల ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. నాణ్యత, అసంపూర్తి పనులపై ఆరా తీసిన నా థుడే కరువయ్యారని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల అవస్థలు...

మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికై న పాఠశాలల్లో ఇప్పటి వరకు డెక్క్‌ బెంచీలు రా లేదు. బెంచీలు లేని పాఠశాలలో ఉదయం నుం చి సాయంత్రం వరకు విద్యార్థులు కింద బండలపైనే కూర్చోవాల్సి వస్తోంది. అదే విధంగా చి న్నారులు కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతుండటంతో కాళ్లకు ఎలర్జీ వచ్చి దురదతో ఎక్కువ మంది విద్యార్థుతు బాధపడుతున్నట్లు పలువు రు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

అపరిశుభ్రంగా మూత్రశాలలు

విద్యార్థుల మూత్రశాలలు, తాగునీటి ఫ్లాట్‌ఫామ్‌, బ్లాక్‌ బోర్డులు కూడా ఎక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటుకు నోచుకోలేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మూత్రశాలల్లో నిల్వనీరు లేకుండా బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయలేదు. వర్క్‌ఆర్డర్‌ ప్రకారం మూత్రశాలలో టైల్స్‌ వేసే పనులు కూడా అసంపూర్తిగానే ముగించేశారు. దీంతో మూత్రశాలలు దుర్గంధాన్ని వెదజల్లుతుండటంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.

పనులు పూర్తి చేయిస్తాం

ఇప్పటి వరకు పనులు పూర్తి కాని పాఠశాలల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పూర్తిగా పనులు చేయకపోవడం వల్ల వారికి రావాల్సిన బిల్లులు రాలేదని తెలిసింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించే విధంగా కృషి చేస్తాం.

- నర్సింహనాయక్‌, ఎంఈవో, తిప్పర్తి

మౌలిక సదుపాయాలు కల్పించాలి

పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కో రాం. సరైన వసతులు లే క విద్యార్థులు తీవర ఇబ్బందులు పడుతున్నారు. మౌలిక వసతులపై అధికారులకు విన్నవించాం. ఉపాధ్యాయుల సమావేశాల సమయాల్లో కూడా పాఠశాల సమస్యలపై తెలియజేశాం. ముఖ్యంగా బెంచీలు, తాగునీరు లాంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

- ఎండీ. శౌకతఅలీ, హెచఎం, ఇండ్లూరు

Updated Date - Jul 12 , 2025 | 12:49 AM