ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలి

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:41 PM

పర్యావరణ పరిరక్షణ కు ప్రతీ ఒక్కరూ పాటు పడాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు. వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే సరైన సమయంలో వర్షాలు పడాలి అలా జరగాలంటే ప్రతీ ఒక్క రూ మొక్కలను నాటాలని పిలిపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌

భీమిని, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణ కు ప్రతీ ఒక్కరూ పాటు పడాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు. వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే సరైన సమయంలో వర్షాలు పడాలి అలా జరగాలంటే ప్రతీ ఒక్క రూ మొక్కలను నాటాలని పిలిపునిచ్చారు. అనంతరం మం డల కేంద్రానికి బస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కాం గ్రెస్‌ మండల అధ్యక్షుడు గాధం లక్ష్మీనారాయణ గతంలో మండల కేంద్రానికి బస్సును ప్రారంభించండి అని విద్యార్థు లు, ప్రయాణికులు ఇబ్బందుల గురించి విజ్ఞప్తి చేయడంతో ఎమ్మెల్యే మంచిర్యాల డిపో అధికారులకు ఆదేశించారు. ఎ మ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల ను కల్పించాలని, ప్రయాణికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. జగ్గయ్యపేట గ్రామంలో దేవాదాయ శాఖ రూపాయలు 28 లక్షలతో, గ్రామస్థులు సేకరించిన 7 లక్షలతో నిర్మించిన శివకేశవ దేవాలయాన్ని ప్ర త్యేక పూజలు చేసి ప్రారంభించారు. బెల్లంపల్లి నియోజకవ ర్గాన్ని అందరి నాయకుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్‌, ఎంపీడీవో గంగమోహన్‌, మర్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ మాధవరపు నర్సింగరావు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ సంగర్సు రవీందర్‌ రావు, యువజన సంఘం ఉపాధ్యక్షుడు ఏల్పుల రోహిత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:41 PM