kumaram bheem asifabad- కొత్త రేషన్ కార్డులకు మోక్షం
ABN, Publish Date - Jul 08 , 2025 | 10:42 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల లబ్ధికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ఏళ్ల తరబడి దరఖాస్తు చేసుకుని వేచి ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 14 వ తేదీ నుంచి లబ్ధిదారులకు రేషన్ కార్డు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- 14 నుంచి పంపిణీ ప్రారంభం
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల లబ్ధికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ఏళ్ల తరబడి దరఖాస్తు చేసుకుని వేచి ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 14 వ తేదీ నుంచి లబ్ధిదారులకు రేషన్ కార్డు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూసిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త కార్డుల మంజూరుతో పాటు పేర్లు చేరికలు, తొలగింపు ప్రక్రియకు అవకాశం కల్పించడంతో పేదల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజాపాలన అరంభం నుంచి ఇప్పటి వరకు వివిధ దశ ల్లో ప్రభుత్వం దరకాస్తులు స్వీకరిస్తోంది. కార్డు లేకపోవడంతో చాలా కుటుంబాలకు రుణ మాఫీ వర్తించలేదు. కొత్తగా మంజూరైన వాటిని ఈనెల 14న పంపిణీకి అధికారులు కసర త్తు చేస్తున్నారు.
- సన్న బియ్యం పంపిణీతో..
చౌకధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో కార్డు పొందేందుకు ఆసక్తి పెరిగింది. ఇటు ప్రజాపాలన ఆటు మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు మార్పులు, చేర్పులకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులందాయి. వాటిని క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించిన అధికారులు అర్హులకు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లాకు కొత్తగా 7,154 కార్డులను అధికారులు మంజూ రు చేశారు. వీటిలో 22, 206 మంది కుటుంబీకులు ఉన్నారు.
- ప్రభుత్వ పథకాల అమలుకు..
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్‌కార్డును ప్రామా ణికంగా తీసుకుంటుండంతో కార్డు కోసం పేద కుటుం బాలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పాటు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నా రు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ మీసేవ కేంద్రాల దరఖాస్తులకే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు చేసుకున్న వారిలో మెజార్టీ సభ్యులు మీసేవ కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకున్నా రని అధికార వర్గాలు చెబుతున్నాయి. కార్డులు పంపిణీ నాటికి మరింత మంది దరఖాస్తులు ఆమోదం పొందు తాయని పాతకార్డుల్లోను సభ్యుల జోడింపు పెరగను న్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
- తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ..
రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. దీంతో జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలు రద్దీగా మారాయి. రేషన్‌కార్డుల్లో కు టుంబ సభ్యుల పేర్లను జోడించడం తో పాటు మార్పులు, చేర్పుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు అనంతరం వాటిని సంబందిత సెక్షన్‌లో అందించేం దుకు వెళుతున్నారు. దీంతో మీసేవ కేంద్రాలు కూడా దరఖాస్తు దారులతో రద్దీగా మారాయి.
Updated Date - Jul 08 , 2025 | 10:42 PM