ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జోరుగా కల్తీనూనె విక్రయాలు

ABN, Publish Date - Jun 06 , 2025 | 11:59 PM

నూనెల ధరలు విపరీతంగా పెరగడంతో దేవరకొండ డి విజనలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.

కొండమల్లేపల్లి సంతలో విక్రయిస్తున్న లూజు నూనె

జోరుగా కల్తీనూనె విక్రయాలు

మామిడి పచ్చడి సీజన కావడంతో విచ్చలవిడిగా లూజు నూనె విక్రయాలు

ఏది అసలో, ఏది నకిలీయో తెలియని పరిస్థితి

అయోమయంలో ప్రజల పరిస్థితి

తనిఖీలు చేపట్టని అధికారులు

దేవరకొండ, జూన 6 (ఆంధ్రజ్యోతి): నూనెల ధరలు విపరీతంగా పెరగడంతో దేవరకొండ డి విజనలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. మామిడికాయ పచ్చడి సీజన కా వడంతో నూనె వ్యాపారులు లూజు నూనె పేరు తో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏది నాణ్యత గల నూనెనో, ఏది నకిలీ నూనెనో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల అ మాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు లూజు నూనె పేరుతో నకిలీ నూనెను విక్రయిస్తున్నారు. దేవరకొండతో పాటు కొం డ మల్లేపల్లి, పీఏపల్లి, చందంపేట, చింతపల్లి, డిండి మండలాల్లో కల్తీనూనె వ్యాపారం కొనసాగుతుంది. అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌, హాలియా, కల్వకుర్తి ప్రాంతాల నుంచి డ్రమ్ములు, క్యాన్లలో నూనెను దేవరకొండ ప్రాం తానికి తరలించి విక్రయిస్తున్నారు. దేవరకొండ, కొండమల్లేపల్లిలలో లూజు నూనె పేరుతో విక్రయాలు జరుగుతున్నాయి. కొండమల్లేపల్లి సంత లో నూనె వ్యాపారం జోరుగా సాగుతుంది.

పెరిగిన నూనె విక్రయాలు

మామిడికాయ పచ్చడి సీజన కావడంతో నూనె విక్రయాలు పెరిగాయి. కిలో నూనె రూ. 150 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. లూ జు నూనె రూ.130 నుంచి 140 వరకు విక్రయిస్తున్నారు. కొండమల్లేపల్లి, దేవరకొండలో కల్తీనూనె వ్యాపారం జోరుగా సాగుతుందని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.

కరోనా తర్వాత పెరిగిన ధరలు

కరోనా సమయంలో కిలోకు రూ.75 ఉన్న మంచి నూనె ప్యాకెట్లు ఇప్పుడు రూ.150 నుం చి 160 వరకు పెరిగింది. ఇదే ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు లూజు నూనె పేరుతో కల్తీనూనె విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజిలెన్స, తూనికల కొలతలు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తో కల్తీనూనె విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్తీనూనెతో అనారోగ్యాల పాలవుతున్నామని, పచ్చడి పెడితే నె ల రోజులు కూడా నిల్వ ఉండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వి జిలెన్స, రెవెన్యూ, ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కల్తీనూనె వి క్రయిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:59 PM