ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొండలను మాయం చేస్తున్న అధికార పార్టీ నాయకులు

ABN, Publish Date - Jul 23 , 2025 | 11:38 PM

అభివృద్ది పేరిట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు గుట్టలు మాయం చేస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించారు. దండేపల్లి మండల కేంధ్రంలో బు ధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’ లో ఈ నెల 21న ప్రచురితమైన ’కరుగుతున్న గుట్ట’ శీర్షికన ప్రచురి త మైన కథనాన్ని ప్రదర్శిస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు.

ఫమాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

ఫ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రదర్శిస్తూ విమర్శలు

మంచిర్యాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అభివృద్ది పేరిట మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు గుట్టలు మాయం చేస్తున్నారని మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు విమర్శించారు. దండేపల్లి మండల కేంధ్రంలో బు ధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’ లో ఈ నెల 21న ప్రచురితమైన ’కరుగుతున్న గుట్ట’ శీర్షికన ప్రచురి త మైన కథనాన్ని ప్రదర్శిస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఈ సంద ర్భం గా దివాకర్‌రావు మాట్లాడుతూ దండేపల్లి మండలంలోని నెల్కివెంక టా పూర్‌ గ్రామంలో గుట్టను తవ్వడంతోపాటు అందుగులపేట శివారులో రెండు మీటర్ల లోతు వరకు అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తవ్వు తున్నారని ఆరోపించారు. మట్టి తీయాలంటే టెండర్లు పిలిస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందన్నారు. దానికి విరుద్దంగా కాంగ్రెస్‌ పార్టీ నా యకులు మట్టి తవ్వకాలు జరుపుతూ రూ. 5వేలకు ట్రిప్పు చొప్పున విక్ర యిస్తూ తమ జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు. ఇంత జరుగు తున్నా మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు పట్టించుకోవడం లేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, అక్ర మార్కులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. భవి ష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమార్కులకు త గిన బుద్ధి చెప్తామని, చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులను సస్పెండ్‌ చేయించి తీరుతామని అన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 11:38 PM